TilluCube : టిల్లు గాని రేంజ్ పెరిగింది.. క్యూబ్ లో కీ రోల్ లో మరో స్టార్ ని దించుతున్నారట?

TilluCube : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్లతో అదరగొట్టాడు. ఇప్పుడు డిజిటల్ లో కూడా విడుదలై భారీ వ్యూస్ తో దుమ్ములేపుతున్నాడు టిల్లు గాడు. రెండేళ్ల కింద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి డిజె టిల్లు అదరగొడితే, టిల్లు స్క్వేర్ మాత్రం ఫస్ట్ పార్ట్ హైప్ తోనే రిలీజ్ అయింది. ఇక టిల్లు గాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో రచ్చ చేసాడో తెలిసిందే. తన డీజే సౌండ్ తో థియేటర్లను హోరెత్తించాడు. ఇక సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధుయే కథని అందించగా ఈ సీక్వెల్ ని దర్శకుడు మల్లిక్ రామ్ అద్భుతంగా తీసాడు. లాజిక్ ల గురించి పక్కన పెడితే టిల్లు గాడు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం లో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక టిల్లు స్క్వేర్ థియేటర్ల దగ్గర ఫైనల్ గా 69 కోట్ల షేర్ తో రచ్చ చేయగా 125 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి, ఇప్పటికి కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

భారీ లాభాలు అందుకున్న నాగవంశీ..

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన టిల్లు స్క్వేర్ (TilluSquare) 69 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ చరిత్రలో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా సంచలనం సృష్టించిన ఈ సినిమా నిర్మాత నాగవంశీకి లాభాల పంట పండించిందని చెప్పాలి. థియేట్రికల్ పరంగానే కాకుండా నాన్ థియేట్రికల్ పరంగా కూడా అన్ని భాషల డిజిటల్ అండ్ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ తో కలిపి ఈ సినిమాకి అక్షరాలా 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. అంటే ఎంత లేదన్న నాగవంశీ ఈ సినిమాకు 50 నుండి 60 కోట్ల మధ్యలో భారీ లాభాన్ని అందుకున్నాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది టిల్లు క్యూబ్ కూడా రాబోతుందని టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడే అనౌన్స్ చేసారు.

Interesting news about Sidhu Jonnalagadda Tillu Cube movie

- Advertisement -

టిల్లు క్యూబ్ లో కీ రోల్ లో స్టార్ హీరో?

ఇక టిల్లు స్క్వేర్ (TilluCube) భారీ విజయంతో త్వరలో మొదలుపెట్టనున్న టిల్లు క్యూబ్ పై మరింత భారీ అంచనాలు పెరిగాయి. సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉన్నప్పటికీ, టిల్లు క్యూబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. టిల్లు క్యూబ్‌లో మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరన్న డీటెయిల్స్ ఏమి రాలేదు. ఇక ఆ హీరోది ప్రత్యేక అతిధి పాత్రలా ఓ పది పదిహేను నిముషాలు డిజైన్ చేసారా? లేక ఇంపార్టెంట్ రోల్ లా అరగంట, గంట నిడివి తో డిజైన్ చేసారా అనేది తెలీదు. బహుశా సీనియర్ హీరో ఎవరైనా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది. ఇక టిల్లు క్యూబ్ తో నాగవంశీ ఈ సారి 200 కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఈ వార్తలు చూస్తుంటే.. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుండే అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ జాక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. జులై లో, లేదా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ చిత్రం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు