Intimate Scene: షూటింగ్లో లిప్ లాక్.. కంట్రోల్ తప్పిన హీరో.. కట్ చేస్తే..!

Intimate Scene.. సాధారణంగా ప్రతి సినిమాలో కూడా ఇంటిమేట్ సన్నివేశాలు చేయడం అంత సులభమేమి కాదు. హీరో హీరోయిన్లు సెట్లో అందరి ముందు ఘాటు రొమాన్స్ చేయడం అంటే ఎంత సాహసంతో కూడుకున్న పనో మనం ఊహించవచ్చు. ముఖ్యంగా ఆ సమయంలో ఎవరికి వారు తమను తాము నియంత్రణలో ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే ఒక 42 సంవత్సరాల హీరో మాత్రం షూటింగ్ అని మరిచిపోయి, సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి, 20 సంవత్సరాల వయసున్న హీరోయిన్ పెదవిని గట్టిగా కొరికి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు.

Intimate Scene: Lip lock in shooting.. Hero lost control.. If cut..!
Intimate Scene: Lip lock in shooting.. Hero lost control.. If cut..!

లిప్ లాక్ సన్నివేషాలు..

ఇంటిమేట్ సన్నివేశాలు అంటే ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే ఎక్కువగా చిత్రీకరించేవారు. కానీ జనరేషన్ మారే కొద్ది అభిమానుల అభిరుచులు మారిపోతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా లిప్ లాక్ సన్నివేషాలు, హాట్ సీన్లు ఇప్పుడు సినిమాలలో కామన్ అయిపోయాయి. అయితే 36 ఏళ్ల కిందట హిందీలో వచ్చిన ఒక సినిమాలో హీరో , హీరోయిన్ మధ్య జరిగిన ఘాటు రొమాన్స్ సీను అప్పట్లో రచ్చ రచ్చ చేసింది. ఆ సినిమా పేరు దయావన్. ఇందులో వినోద్ ఖన్నా (Vinod Khanna), మాధురి దీక్షిత్ (Madhuri Dixit)హీరో హీరోయిన్లుగా నటించగా, అప్పటికే వినోద్ ఖన్నా వయసు 42 ఏళ్లయితే , మాధురి దీక్షిత్ వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.

కంట్రోల్ చేసుకోలేకపోయిన హీరో.

ఈ సినిమాల్లో ఆజ్ ఫిర్ తుమ్ సే అనే ఒక పాట షూటింగ్లో ఇద్దరి మధ్య ఒక ఘాటు రొమాన్స్ సన్నివేశం చేయాల్సి వచ్చిందట. అందులో భాగంగానే హీరో, హీరోయిన్ మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని డైరెక్టర్ చెప్పారు. అందులో భాగంగానే అందరి ముందే ఈ ఇంటిమేట్ సీన్ చేశారు మాధురి దీక్షిత్, వినోద్ ఖన్నా. ఇకపోతే ఈ సీన్ షూటింగ్ చేసే సమయంలో వినోద్ ఖన్నా తనను తాను కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ మాధురి దీక్షిత్ పెదవిని గట్టిగా కొరికేశాడు. ఆయన వినకుండా అలాగే కంటిన్యూ చేయడంతో ఈ విషయం కాస్త అప్పట్లో పెద్ద రచ్చయింది.

- Advertisement -

కంట్రోల్ తప్పి హీరోయిన్ పెదవి కొరికిన వినోద్ ఖన్నా..

సాధారణంగా ఇంటిమేట్ సీన్లు చేసేటప్పుడు ఒకరికొకరు కంట్రోల్ చేసుకోవాలి. కానీ వినోద్ ఖన్నా ఇక్కడ అదుపుతప్పినట్లు తెలుస్తోంది. అప్పటికే బాలీవుడ్లో మంచి పేరు సొంతం చేసుకున్న వినోద్ ఖన్నా ఇలా చేయడంతో హీరోయిన్ మాధురి దీక్షిత్ ఒక్కసారిగా షాక్ తిని అతడు గట్టిగా కొరకడంతో ఆమె పెదవి కట్టయ్యి రక్తం కూడా కారిపోయింది. అది తట్టుకోలేక ఏడుస్తూ ఉండిపోయింది మాధురి దీక్షిత్. ఇక షూటింగ్ చేయడానికి కూడా ఆమె నిరాకరించడంతో డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ రంగంలోకి దిగి, వినోద్ కన్నా తో పాటు అతడు కూడా మాధురి దీక్షిత్ కు క్షమాపణలు చెప్పి ఆమెను ఒప్పించారు . ఈ విషయం మాత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది.

నాయకుడు సినిమాకు రీమేక్..

ఇకపోతే ఈ సినిమా తమిళ్, తెలుగులో సూపర్ హిట్ అయిన నాయకుడు సినిమాకి రీమేక్ కావడం గమనార్హం. ఇకపోతే 1987లో కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చి మంచి విజయం అందుకున్న ఈ సినిమా హిందీలో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు