Adipurush: టీ – సిరీస్ కి ఆదిలోనే హంసపాదు ఎదురైందా..?

ప్రముఖ ఆడియో కంపెనీ టీ – సిరీస్ ఇవాళ భారీ ఎత్తున రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాని రెట్రోఫైల్స్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలన్నది ఆ సంస్థ ప్లాన్. ఈ సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఏడు అంతస్థుల కా ర్పొరేట్ బిల్డింగ్ కోసం స్థల సేకరణ, ప్రభుత్వ అనుమతులు వంటి గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయ్యిందని సమాచారం. అయితే, ఆదిపురుష్ ద్వారా టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని భావించిన టీ సిరీస్ సంస్థకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన సొంతం చేసుకోవడంతో టీ సిరీస్ అధిచిన గ్రాండ్ ఎంట్రీ మిస్ అయ్యింది.

బాక్సాఫీస్ వద్ద వెయ్యికోట్లు కొల్లగొట్టాలన్న టార్గెట్ తో సినిమాను రిలీజ్ చేసిన మేకర్స్ కి ఆ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది మొదటి రోజు టాక్ చూస్తే. ఈ సినిమాపై ఒక రాజకీయ పార్టీ ప్రభావం ఉందన్న టాక్ కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నిగిటివిటీ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ ఆదిపురుష్ సినిమాకి మొదటి రోజు 100కోట్ల మార్క్ అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో రెండో రోజు వసూళ్లు ఇదే రేంజ్ లో ఉంటాయా అన్నది ప్రశ్నార్థకం.

ఒక్క శ్రీరామరాజ్యం మినహా తెలుగులో రామాయణం ఆధారంగా రిలీజైన ప్రతి సినిమాని ఓన్ చేసుకొని బ్రహ్మరథం పట్టిన టాలీవుడ్ ఆడియెన్స్ ఆదిపురుష్ లోని కృత్రిమత్వాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.మొత్తానికి ఆదిపురుష్ సినిమాపై రాజకీయ పార్టీ ప్రభావం ఉందన్నది ఎంతవరకు వాస్తవమో తెలీదు గానీ, టీ సిరీస్ టాలీవుడ్ ఆశలపై అనుమానపు ఛాయలు అలుముకోవటానికి అది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు