Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతడేనా?

Devi Sri Prasad : టాలీవుడ్ ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ( Devi sri )గురించి, ఆయన మ్యూజిక్ సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో హిట్ సినిమాలకు చక్కని బాణీలు అందించాడు. ఈయన సినిమాలు ఏమో గానీ పెళ్లి పై పలు రకాల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఆయన పెళ్లి పై ప్రస్తావన తియ్యలేదు. గతంలో ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అందులో నిజం లేదని తెలిసింది. దేవి శ్రీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక వ్యక్తి అని తెలుస్తుంది. అతని కోసమే అతను పెళ్లి చేసుకోలేదని సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న టాక్.. అతను ఎవరు? అతనికి పెళ్లికి సంబంధం ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేది ప్రజెంట్ న్యూస్.. ఆయన ఇంత వయస్సు వచ్చినా పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఆయన తమ్ముడు సాగర్ (Sagar ) అని తెలుస్తుంది. సాగర్ సింగర్ గా ఎన్నో పాటలను పాడారు. ఈ మధ్య పాటలు పాడినట్లు కనిపించలేదు. అతని కేరీర్ అంతగా ఆశించినట్లు ముందుకు సాగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దాని వల్లే దేవి పెళ్లికి దూరం అయ్యినట్లు టాక్.. అతన్ని పూర్తిగా సెటిల్ అయ్యేలా చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వచ్చే భార్య సాగర్ కు దేవికి అడ్డుగా రాకూడదని అందుకే పెళ్లి ఆలస్యం చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

Is he the reason why Devi Sri Prasad did not marry?
Is he the reason why Devi Sri Prasad did not marry?

ఇక దేవి కేరీర్ విషయానికొస్తే.. పుష్ప సినిమాలో ఉంటావా మామ పాట హిట్ కారణంగా దేవి శ్రీ ప్రసాద్ పేరు నాలుగు సార్లు అయినా వినిపించిందే కానీ ఆ తర్వాత తమన్ దెబ్బకి దేవిశ్రీప్రసాద్ బొక్క బోర్లా పడిపోయాడు . మొన్నటివరకు ఆయనతో సినిమాలు చెయ్యడానికి హీరోలు కూడా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు పుష్ప 2 ( Pushpa 2) సినిమా చేస్తున్నాడు. కంగువ ( Knguva) సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక పెళ్లి విషయమే ఆయన ఫ్యాన్స్ కు భాధగా అనిపిస్తుంది. ఇక ఎప్పుడూ పెళ్లి చేసుకుంటాడు.. అసలు చేసుకుంటాడా అని నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. ఫ్యూచర్ లో అయిన గుడ్ న్యూస్ ను చెప్తాడేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు