Matka: అసలే మార్కెట్ దెబ్బ తింది, మళ్ళీ అంత బడ్జెట్ తో రిస్క్ అవసరమా వరుణ్ బాబు.?

Matka: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ లో వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ అందరిలా కాకుండా తనకంటూ విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ కెరియర్లో ముందుకు వెళుతున్నాడు. ఇప్పటివరకు వరుణ్ తేజ్ కెరియర్ లో ఎన్నో కాన్సెప్ట్ బేస్ సినిమాలు కూడా చేశాడు. వరుణ్ తేజ్ కెరియర్లో కమర్షియల్ సినిమాలో ఉన్నాయి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే శేఖర్ కమ్ముల వెంకీ అట్లూరి వంటి దర్శకులు దర్శకత్వంలో లవ్ స్టోరీస్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పొచ్చు.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ హిట్ సినిమా చూసి చాలా ఏళ్లయింది. వరుణ్ తేజ్ కెరియర్ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో సతమతమవుతూ వస్తుంది. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ తరుణంలోనే వరుణ్ తేజ్ మాట్లాడుతూ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా నా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను కానీ సినిమాలు చేయటం మానను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వరుణ్ తేజ్ మార్కెట్ ప్రస్తుతం నిజంగానే దెబ్బతింది.

Varun Tej

- Advertisement -

ప్రస్తుతం కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఒక గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రాబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ 3 పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో వైజాగ్ ఎలా ఉండేది అనే దానికి సంబంధించి ఓ భారీ సెట్టింగ్ కి భారీ ఖర్చుతో నిర్మించినట్లు సమాచారం వినిపిస్తుంది. దీనికి దాదాపు 15 కోట్ల ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ కి ఉన్న మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు