SPY: ఈ టాక్ తో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?

కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా ఎడిటర్ గ్యారీ దర్శకత్వంలో వచ్చిన స్పై సినిమా విడుదలై డివైడ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందిన సినిమా కావటం, కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నుండి వచ్చిన సినిమా కావటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథను ఎంగేజింగ్ చెప్పటంలో దర్శకుడు విఫలం కావటం వల్ల సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. పర్ఫామెన్స్ పరంగా నిఖిల్ మెప్పించినా సినిమా గ్రిప్పింగ్ గా లేకపోవటం వల్ల డివైడ్ టాక్ సొంతం చేసుకుంది.
సినిమా రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ కారణంగా స్పై సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగింది. మొదటి రోజు 6.85కోట్ల గ్రాస్ వసూలు చేసిన స్పై సినిమా నిఖిల్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అయితే, 17.50కోట్ల మేర బిజినెస్ జరిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 12కోట్లకు పైగా వసూలు చేయాలి.
డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా టార్గెట్ ని రీచ్ కావటం అంత సులభం కాదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే, సామజవరగమన సినిమా మినహా పెద్ద సినిమాలేవీ లేకపోవటం స్పై కాస్త అడ్వాంటేజ్ అయ్యేలా ఉన్న అంశం అని చెప్పాలి. సాధారణంగా ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా సోమవారం నుండి కలెక్షన్స్ డ్రాప్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్పై ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బట్టి బ్రేకివెన్ అవుతుందా లేదా అన్నది డిసైడ్ చేయచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు