Pushpa 2 : సుకుమార్‌ను బలి చేసే ప్లాన్… అంతా అల్లు అర్జునే చేస్తున్నాడా..?

Pushpa 2 : అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ బయట కనిపించాడు. అది కూడా గడ్డం లేకుండా. ఓ హీరో గడ్డం లేకుండా బయట కనిపించడం అనేది అసలు న్యూస్ కాదు. కానీ, ఇక్కడ పుష్ప రాజ్ ‌గా గత మూడేళ్లుగా బిజీగా ఉన్న అల్లు అర్జున్ గడ్డం లేకుండా బయట కనిపించడంతో ఎన్నో అనుమానాలు.. ఇంకెన్నో అర్థాలు.. మరెన్నో నానార్థాలు వచ్చాయి బయటికి.

అన్నింటికీ అర్థం… పుష్ప 2 సినిమా డిసెంబర్ లో రాదు. మరి కొన్ని మీడియా సంస్థలు అయితే పుష్ప 2 రద్దు అయింది అని కూడా రాసుకొచ్చాయి. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయని, వీటి ఫలితంగా మూవీ క్యాన్సిల్ అయ్యే వరకు వచ్చిందని గాసిప్స్ వచ్చాయి. కానీ, మంగళవారం సాయంత్రం… పుష్ప 2 అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఓ పోస్టర్ వచ్చింది. తమ సినిమా డిసెంబర్ 06నే రిలీజ్ అవుతుంది అంటూ ఇప్పటి వరకు వచ్చిన గాసిప్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పోస్టర్ బాగానే ఉంది. పోస్టర్ రిలీజ్ చేసిన టైం బాగానే ఉంది. కానీ, సినిమా పరిస్థితే అంత బాలేదు. ఇప్పటి వరకు సినిమా 80 శాతం పూర్తి అయింది. ఈ 80 శాతానికే 4 గంటల నిడివి ఉన్న సినిమా వచ్చింది. నిజానికి అల్లు అర్జున్ కి కోపం రావడానికి కూడా ఇదేనట.

- Advertisement -

గొడవ ఇదే…

ఇప్పటికే మూడేళ్లు అవుతుంది. ఇంకా 20 శాతం షూటింగ్ చేయాల్సి ఉంది. అలాగే మూడు గంటలు ఉండాల్సిన సినిమా ఇప్పటికే 4 గంటలు అయింది. ఇప్పుడు మరో పార్ట్ తీయ్యాలా…? మరో మూడేళ్లు నీతోనే ఉండాలా..? త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా లను నీ కోసం పక్కన పెట్టాలా అంటూ సుక్కు పై బన్నీ సీరియస్ అయ్యారాట. దీని వల్ల 4 గంటల నిడివి తగ్గించు అంటూ ఎడిటర్ కి చెప్పి సుక్కు విదేశాలకు వెళ్లి రిలాక్స్ అయ్యారట. సుక్కు ఫారన్ ట్రిప్ బన్నీకి మరింత కోపం తెప్పించి, గడ్డం తీసేసి.. ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లాడని సమాచారం. వీరి ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగించడానికి మైత్రీ మూవీ మేకర్స్ ట్రై చేశారనే టాక్ కూడా ఉంది.

ఫహద్ ఫాజిల్ ఇప్పుడు తగ్గేదేలా..

ఫహద్ ఫాజిల్‌తో కూడా సుకుమార్ కు ఇష్యూ ఉంది. ఫహద్ కు స్టోరీ చెప్పిన టైంలో పార్ట్ 2 అని చెప్పలేదట. సరేలే పార్ట్ 1 హిట్ అయింది కదా.. పార్ట్ 2 చేస్తే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుందని, ఫహద్ ఒప్పుకున్నారట. అందుకు సుక్కు అడిగిన వెంటనే… ఈ ఏడాది స్టార్టింగ్ ఫిబ్రవరి నెలలో డేట్స్ ఇచ్చారట. కానీ, ఆ టైంలో ఫహద్ సీన్స్ షూట్ అవ్వలేదు. దీంతో మరిన్నీ డేట్స్ కావాలంటే.. ఆయన ఇవ్వడానికి రెడీ లేడని సమాచారం. ఇప్పటికే పుష్పకు చాలా డేట్స్ ఇచ్చానని, తనకు చాలా సినిమాలు ఉన్నాయని, ఇప్పుడు టైం వేస్ట్ చేయాలననే ఆన్సర్స్ ఆయన నుంచి వస్తున్నాయని టాక్. ప్రస్తుతం మైత్రీ వాళ్లు ఆయనను కూడా బుజ్జగించారు.

చేయాల్సింది బాగానే ఉంది…

ఈ 20 శాతం షూట్ చేయ్యడానికి దాదాపు 60 నుంచి 70 రోజుల టైం పట్టొచ్చు. ఈ టైంలో అల్లు అర్జున్, ఫహద్ ఫజిల్ లపై షూట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ పొడక్షన్.. ఆ తర్వాత ప్రమోషన్స్.. అది కూడా పాన్ ఇండియా లెవెల్‌లో చేయ్యాలి దాని కూడా ఎక్కువే టైం పట్టొచ్చు. అంటే డిసెంబర్ వరకు అల్లు అర్జున్ వేరే సినిమాలవైపు వెళ్లడం కష్టమే.

సుక్కునే బాధ్యుడిని చేస్తున్నారా..?

సినిమా లేట్ అవ్వడానికి కారణం సుక్కు అని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అనవసరమైన సీన్స్ షూట్ ఎక్కువ తీశారని, నటీనటుల డేట్స్ ను సరిగ్గా ప్లాన్ చేయలేదని, అందువల్లే అల్లు అర్జున్ మూడేళ్ల పాటు ఒకే సినిమా పట్టుకుని కూర్చోవాల్సి వచ్చిందని అంటున్నారు. దీని అంతటికి కారణం సుక్కునే అంటూ మండిపడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యాకా… ఏ మాత్రం తేడా కొట్టినా… సుక్కునే బాధ్యుడిని చేసే ఛాన్స్ లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు