Mega daughter: నిహారిక విడాకులు తీసుకోవడానికి పెద్దవారు చేసిన ఆ తప్పే కారణమా..?

మెగా కుటుంబంలో మరో జంట విడాకులు తీసుకుంది. మెగా ప్రిన్సెస్ నిహారిక విడాకులు తీసుకుంటుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా స్పందించని నిహారిక, ఆమె భర్త చైతన్య.. ఇద్దరూ విడాకులపై అధికారికంగా ప్రకటించారు. గత నెలలోనే వీరు విడాకులు తీసుకోగా.. ఈ అంశం మూడు రోజుల కిందట బయటపడింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరు ఇద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయి. దీంతో మూడు రోజులుగా వీరి విడాకులు అంశం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

అయితే తాజాగా వీరి విడాకుల గురించి మరో అంశం తెరపైకి వచ్చింది. నిహారిక – చైతన్య విడాకులు తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు చేసిన తప్పు కూడా ఓ కారణమని సమాచారం. సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఎన్నో ఆచార వ్యవహారాలు పాటించవలసి ఉంటుంది. కానీ నేటి కాలంలో అలాంటి ఆచారాలకు తావు లేకుండా పోయింది. కేవలం ఫోటోలు, వీడియోలు అంటూ వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సరైన సమయానికి పెళ్లిళ్లు జరగడం లేదు.

అంతేకాకుండా ఒక సంబంధం కలుపుకునే ముందు వారి జాతకాలను పరిశీలించడం చాలా ముఖ్యమైన విషయం. వారి జాతకాల ప్రకారం పండితులు సూచించిన సమయానికి వివాహం జరగాలి. కానీ నిహారిక – చైతన్య విషయంలో అలా జరగలేదు. నిహారిక – చైతన్యల జాతకాల ప్రకారం నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరగలేదట. కాస్త ఆలస్యంగా పెళ్లి జరగడంతో వీరి వైవాహిక జీవితంలో ఆటంకాలు ఏర్పడ్డాయని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రూమర్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వివాదాలే వీరు విడాకులు తీసుకునేందుకు కారణమయ్యాయట.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు