Shiva karthikeyan: ‘అయలాన్’ కహాని మొత్తం అదే.. కానీ?

కోలీవుడ్ లో ఈ పొంగల్ కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘అయలాన్’ కూడా ఒకటి. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పొంగల్ స్పెషల్ గా జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయగా, సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నడుస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ని చూసాక కథ విషయానికి వస్తే అన్ని జీవరాసుల్ని ప్రేమిస్తూ, సమానంగా చూసే వ్యక్తి దగ్గరికి అనుకోకుండా ఓ ఏలియన్ భూమి మీదకి వచ్చి చేసిన పనులేంటి? ఆ ఏలియన్ భూమ్మీదికి రావడానికి గల కారణం ఏంటి? దానికి హీరో ఏం హెల్ప్ చేసాడు అనేది స్టోరీ.

అయితే ఏలియన్ సినిమా అనగానే ఇండియన్స్ అందరూ ముందుగా బాలీవుడ్ మూవీ ‘కోయి మిల్ గయా’ ని కంపేర్ చేసి చూస్తారు. కానీ హాలీవుడ్ లో మాత్రం ఏలియన్ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా కొన్ని ఇంగ్లిష్ సినిమాలు చూసిన నెటిజన్లు కొందరు, ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాని పోలి ఉందని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ఏలియన్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో 2011 లో రిలీజ్ అయిన మూవీ “పౌల్”. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఒక్కసారి ట్రైలర్ చూస్తే కూడా అలాగే అయలాన్ ని కూడా దింపేసాడు అనిపిస్తుంది. మహా అయితే ఇండియన్ వెర్షన్ కి తగ్గట్టు చేంజ్ చేసి, అక్కడా ఇక్కడా డ్రామా బిల్డ్ చేసాడు అనిపిస్తుంది. మరి ఈ విషయం పై మేకర్స్ ఎక్కడా స్పందించలేదు. కానీ నెటిజన్లు మాత్రం ఈ సినిమా మొత్తం కాపీ కొట్టి క్రియేటివిటీ అని బిల్డప్ ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ క్లారిటి ఏమిస్తారో, ఆడియన్స్ కి ఏం సమాధానం చెప్తారో..

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు