Salaar: సలార్ టీజర్ టైమ్ వెనుక ఇంత కథ ఉందా – ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ సంచలనం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన టీజర్ అనౌన్స్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 6న ఉదయం 5:12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అవుతుందంటూ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది సినిమా యూనిట్. సాధారణంగా టీజర్, ట్రైలర్ లాంటి అప్డేట్స్ సాయంత్రం సమయంలో వాస్తు ఉంటాయి. సలార్ టీజర్ మాత్రం ఇందుకు భిన్నంగా తెల్లవారుజామున వస్తుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ టైమ్ పెద్ద కథ ఉందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, కజిఎఫ్ చాప్టర్2లో రాఖీభాయ్ క్లైమాక్స్ సముద్రంలో కనిపించకుండా వెళ్లే సమయం కూడా 5:12 నిమిషాలు ఉంటుంది, ఇప్పుడు సలార్ టీజర్ రిలీజ్ టైమ్ కూడా అదే ఉండటంతో కేజిఎఫ్ కి సలార్ కి లింక్ ఉందన్న వార్తలు నిజమే అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ నిజంగానే ఇలా ప్లాన్ చేసాడో లేక కోఇన్సిడెన్స్ అయ్యుండచ్చేమో గానీ, టీజర్ అప్డేట్ మాత్రం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రశాంత్ యూనివర్స్ లో భాగం అని, కేజిఎఫ్ కి ఈ సినిమా లింక్స్ ఉన్నాయని చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే టీజర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. మరి, ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఒక్క అప్డేట్ తో ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేసిన సినిమా యూనిట్ టీజర్ ద్వారా అభిమానుల అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు