Salaar: సలార్ ట్రైలర్లో హీరో యష్ ఉన్నారా..?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్.. ఈ సినిమా మొదటి భాగం ఈనెల 22వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇందులో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా.. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలలో జగపతిబాబు శ్రియా రెడ్డి కూడా నటిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఈ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదలై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

పవర్ ప్యాకెట్ ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సలార్ సినిమా ట్రైలర్ ఫుల్ కిక్కించేలా అభిమానులకు ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా చాలా రోజుల నుంచి సలార్ సినిమాకి కేజిఎఫ్ సినిమాకి లింక్ ఉందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. నిన్నటి రోజున సెకండ్ ట్రైలర్లలో కొంతమంది అభిమానులు ఈ సినిమా లోని ఒక వ్యక్తిని బ్యాక్ షాట్ నుంచి చూపించడం జరిగింది. అయితే ఆ కటౌట్ చూస్తూ ఉంటే హీరో యష్ లాగా కనిపిస్తున్నారంటూ స్క్రీన్ షాట్లు తీసి ఆ ఫోటోని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన మూవీ లవర్స్ ఈ సినిమాలో యష్ కూడా ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ గతంలో కేజిఎఫ్ రెండు భాగాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. కానీ డైరెక్టర్ మాత్రం సలార్ , కే జి ఎఫ్ సినిమాకు ఎలాంటి కనెక్షన్ లేదంటూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో యష్ కనిపించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో యష్ రాఖీ బాయ్ గానే కనిపించారా లేక ఏదైనా కొత్త పాత్రలో కనిపించనున్నారా లేక సలార్ వరల్డ్ కి సంబంధించిన కొత్త రోల్ ఉంటుందేమో అంటూ పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు..

- Advertisement -

మరి కొంతమంది సలార్ సినిమాకి కేజిఎఫ్ చిత్రాలకు సంబంధం లేదని డైరెక్టర్ చెప్పారు. కానీ ఇందులో యష్ లేడని చెప్పలేదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఇలాంటి సందేహాలు అన్నిటికీ కూడా సమాధానం దొరకాలి అంటే ఈ నెల డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటుంది. ఇటీవలే రాజమౌళి చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా చిత్ర బృందం పాల్గొని ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలను తెలియజేయడం జరిగింది. మరి యష్ కి సంబంధించి ఈ పోస్టర్ వైరల్ గా మారుతున్నది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు