Balakrishna: భగవంత్ కేసరి లో కాజల్ పాత్ర ఇదేనా?

నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” అనే సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఆ షూట్ లో బాలయ్య, కాజల్ అగర్వాల్ పై పలు సీన్స్ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధం అవుతుంది.

అఖండ, వీర సింహారెడ్డి సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడం తో బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంటే, శ్రీ లీల బాలయ్య కూతురిగా నటిస్తుందని అంటున్నారు. అయితే ఇక్కడే ఓకే డౌట్ వస్తుంది. రీసెంట్ గా కాజల్ బర్త్ డే కి విష్ చేస్తూ చిత్ర యూనిట్ కాజల్ ఫస్ట్ లుక్ వదలిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ లెక్చరర్ పాత్ర చేస్తుందని ఆ స్టిల్ ని చూస్తుంటే అనిపిస్తుంది.

ఇక ఆ లుక్ లో కాజల్ యంగ్ గానే ఉన్నట్టు ఉంది. మరి బాలయ్య కూతురు శ్రీలీలే అయితే కాజల్ తల్లి కదా. అయితే స్టిల్ లో ఏంటి ఇంత యంగ్ గా ఉందని నెటిజన్లు సందేహపడ్డారు. బహుశా కాజల్ ఫ్లాష్ బ్యాక్ సీన్ స్టిల్ అయ్యుంటుందా? లేక శ్రీ లీల బాలయ్యకి మొదటి భార్య కూతురో అయ్యి ఉండవచ్చని అంటున్నారు.

- Advertisement -

ఒకవేళ బాలయ్య శ్రీ లీల దత్తత కూతురు అయికూడా ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి కాజల్ ఇందులో శ్రీ లీలకి తల్లి పాత్ర చేస్తే, విడుదలైన ఆ ఫస్ట్ లుక్ ఏ సీన్ కి సంబంధించినదో అని ఫ్యాన్స్ కి అర్ధం కావట్లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ చెప్పాల్సి ఉంటుంది. లేదా “భగవంత్ కేసరి” ట్రైలర్ వచ్చే వరకు వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు