Bimbisara2: కళ్యాణ్ రామ్, వశిష్ట మధ్య విభేదాలకు కారణం ఇదేనా..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన నింబిసార సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పార్ట్ 2 ఉండనుందని అనౌన్స్ చేశారు, ఈ మేరకు దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడన్న వార్తలొచ్చాయి. అయితే, పార్ట్2 కి దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్ చేయట్లేదని తాజాగా అందుతున్న సమాచారం. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన వశిష్ఠ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత బింబిసార పార్ట్ 2 పై దృష్టి పెట్టనున్నాడు.

బింబిసార సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ డెవిల్ లాంటి ప్రాజెక్ట్స్ కి కమిట్ అవ్వడం, వశిష్ఠ కూడా ఆ గ్యాప్ లో చిరంజీవితో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉండటం వల్ల బింబిసార2 మీద దృష్టి పెట్టలేని పరిస్థితి తలెత్తిందని టాక్ వినిపిస్తోంది. అయితే, కళ్యాణ్ రామ్ వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలనే ప్లాన్ ఉన్నందు వల్ల కొత్త దర్శకుడి కోసం వెతుకుతున్నాడని అంటున్నార. ఈ మేరకు రొమాంటిక్ సినిమా డైరెక్టర్ అనిల్ పాడూరితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అనిల్ పాడూరికి వీఎఫెక్స్ పట్ల మంచి గ్రిప్ ఉండటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్, వశిష్ఠ మధ్య ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ కి సంబంధించి కూడా కొన్ని సమస్యలు తెలెత్తడం కూడా ఈ సినిమా డిలే అవటానికి కారణం అని తెలుస్తోంది. అయితే, ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరి, పార్ట్ 1 ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, పార్ట్ 2తో ఏ మేరకు అలరిస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు