Jackky Bhagnani : పీకల్లోతు అప్పుల్లో రకుల్ భర్త… ఆ బడా హీరోనే కారణమా?

Jackky Bhagnani : సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. దాదాపు 250 కోట్ల అప్పుల భారంతో ఉన్న ఆయన, వాటిని తీర్చడానికి ఏకంగా ఆస్తులనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనంతటికీ కారణం ఓ బడా హీరో అంటున్నారు. మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షయ్ కుమార్ కారణమా?

అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన మల్టీస్టారర్ ‘బడే మియాన్‌ ఛోటే మియాన్‌’ సినిమాపై నిర్మాత వాషు భగ్నానీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. విడుదలకు ముందే ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. కేవలం 50 కోట్లు మాత్రమే రాబట్టి నిర్మాతలను నిండా ముంచింది. సినిమా ఫ్లాప్ కావడంతో భగ్నాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ భారీ ఆర్థిక నష్టాన్ని చవి చూసింది.

ఈ సినిమా నష్టం వల్ల వచ్చిన రూ.250 కోట్ల అప్పు తీర్చేందుకు వాషు భగ్నానీ ముంబైలోని తన ఆఫీసును అమ్మేసినట్లు ఓ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్థికంగా నష్టపోవడంతో ప్రొడక్షన్ హౌస్ సిబ్బందిని తగ్గించారు. వారు దాదాపు 80 శాతం మందిని తొలగించారు. బాలీవుడ్ మీడియా ప్రకారం ముంబైలో ఉన్న 7 అంతస్తుల బంగ్లాను ఈ అప్పులు తీర్చడం కోసం అమ్మేశారట. ఇప్పుడు ముంబైలోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆఫీసును ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే దీనిపై ప్రొడక్షన్ హౌస్ ఇంకా స్పందించలేదు.

- Advertisement -

Producer Vashu Bhagnani Sells Pooja Entertainment Office To Pay Off Debts Worth Rs 250 Crore, Lays Off Employees: Report | Times Now

ఎలా స్టార్ట్ అయ్యిందంటే?

ఇదంతా 2021లో రిలీజైన ‘బెల్ బాటమ్’ మూవీతో ప్రారంభమైంది. ఇది కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లలోకి వచ్చిన మొదటి హిందీ చిత్రాలలో ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘మిషన్ రాణిగంజ్’, టైగర్ ష్రాఫ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘గణపత్’ కూడా ఫ్లాప్ అయింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను విడుదల చేయడానికి నిరాకరించింది. దీనితో అప్పులు పెరిగాయి. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ ‘బడే మియాన్ ఛోటే మియాన్’లో పెట్టుబడి పెట్టింది. ఈ చిత్రం హిట్ అయితే పరిస్థితి మెరుగుపడుతుందని భగ్నాని ఆశించారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ అప్పును కట్టడానికి కార్యాలయాన్ని అమ్మడం తప్ప వాషుకి వేరే మార్గం లేకుండా పోయింది.

పూజా ఎంటర్‌టైన్‌మెంట్ 1986లో స్థాపించబడింది. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పటి వరకు దాదాపు 40 చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, వైఫ్ నంబర్ 1, బడే మియాన్ ఛోటే మియాన్, రహనా హై తేరే దిల్ మే, ఓం జై జగదీష్ వంటి చిత్రాలను నిర్మించింది. అయితే ఇటీవ‌ల కొన్ని ఫ్లాపుల‌తో ఆ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అందులోనూ ఎక్కువగా అక్షయ్, టైగర్ సినిమాల నష్టమే ఉండడంతో జాకీ నిర్మాణ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలే కారణం అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు