Star Heroine : 8 ఏళ్లుగా నో హిట్.. కానీ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఎలా వచ్చాయబ్బా..?

Star Heroine : ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినీ తారలు హిట్ సినిమాలు ఉంటేనే రెమ్యూనరేషన్ పెంచుతు ఉంటారు. ఒక్కో సినిమా హిట్ అయ్యేకొద్ది లగ్జరి లైఫ్ ను అందుకుంటారు. ఖరీదైన కార్స్, పెద్ద పెద్ద విల్లా ఎలా వారు సంపాదించిన ఆదాయాన్ని భూములపై, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఇళ్లపై వారు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఒకరు మాత్రం ఏకంగా ఐలాండ్ నే కొనేసింది. అంత డబ్బులు ఉండేలా సినిమాలు కూడా లేవు కానీ ఎలా కొనింది అనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పటివరకు అలా సొంత ఐలాండ్ ఉన్నవారు కేవలం భారత దేశంలో ముగ్గురే ఉన్నారు. ఇంతకీ ఆ ముగ్గురులో ప్రైవేట్ ఐలాండ్ ఉన్న వారిలో ఈ హీరోయిన్ జాక్వాలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernande) .  గత ఎనిమిదేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా లేదు. కానీ ప్రైవేట్ ఐల్యాండ్ ఉంది. లాస్ట్ ఎనిమిదేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. ఇలా ఆస్తులు ఉండటం పై ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ అమ్మడు అలాడిన్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మర్డర్, హౌస్ ఫుల్ 2, రేస్ 2, కిక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ బ్యూటీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. చివరిగా హౌస్ ఫుల్ 3 సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది.

Jacquilai Fernande bought an island in Sri Lanka
Jacquilai Fernande bought an island in Sri Lanka

ఈ అమ్మడు చేసింది కూడా తక్కువ సినిమాలే. తెలుగులో కూడా మంచి క్రేజ్ ను అందుకుంది. 2012 లో ఈమె శ్రీలంకలో లో ప్రైవేట్ ఐలాండ్ ను కొనుగోలు చేసింది. అప్పట్లో దాని విలువ చాలా తక్కువట. కేవలం రూ.3 కోట్లకే ప్రైవేట్ ఐలాండ్‌ను తన సొంతం చేసుకున్న జాక్వెలిన్ వరుసగా సినిమాలన్నీ హిట్ కొడుతున్న సమయంలో ఆమె దాన్ని కొనుగోలు చేసింది. ఇక ఈ ప్రైవేట్ ఐలాండ్‌లో ఆధ్యాత్మిక సౌకర్యాలు కలిగిన ఒక మంచి భవనాన్ని నిర్మించాలని ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఇక ఆ ల్యాండ్ మాత్రమే కాదు సొంతంగా ఇల్లు, ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈమె సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు