Jai Hanuman: జై హనుమాన్ మూవీలో కోలీవుడ్ టాప్ స్టార్..!

Jai Hanuman.. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్. పెద్ద సినిమాలకు పోటీగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకొని, రూ.100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించారు. ఇకపోతే ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా సీక్వెల్ పై అందరి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా ఎండింగ్ లోనే జై హనుమాన్ టైటిల్ తో సినిమా వస్తుందని, అప్పుడే చిత్ర బృందం రివీల్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జై హనుమాన్ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటించనున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Jai Hanuman: Kollywood top star in Jai Hanuman movie..!
Jai Hanuman: Kollywood top star in Jai Hanuman movie..!

హనుమంతుడి పాత్రలో మెగా హీరో..

ఈ ఏడాది జనవరిలోనే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగుకి కాస్త బ్రేకులు వేశారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా నిర్మాత ఈ గోచైతన్య రెడ్డి హనుమంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి లేదా ఆయన వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే బాగుంటుంది అని తెలిపారు. అయితే ఈ వార్త కాస్త అప్పట్లో వైరల్ గా మారింది. కచ్చితంగా మెగా హీరోలలో ఎవరో ఒకరిని హనుమంతుడి పాత్ర కోసం రంగంలోకి దింపుతారని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే నిజానికి వ్యక్తిగతంగా చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు అందుకే చిరంజీవి అయితే బాగుంటుందని మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే మరోపక్క చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పైగా డెప్త్ ఉన్న పాత్ర కాబట్టి ఎవరైనా స్టార్ హీరో చేస్తేనే బాగుంటుందని ప్రశాంత్ వర్మ కూడా అనుకున్నట్లు సమాచారం . ఈ నేపథ్యంలోని మెగా హీరోలలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ రాలేదు.

పరిశీలనలో అజిత్..

ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం మరో కోలీవుడ్ స్టార్ హీరో పేరు ప్రథమంగా వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు అజిత్.. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులు. ఈయన చాలా చిత్రాలు డబ్బింగ్ అయి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పైగా ఈయనపై ఎటువంటి కాంట్రవర్సీలు కూడా లేవు. అందుకే చిరంజీవి ఒప్పుకుంటే ఆయన నటిస్తారు.. లేకపోతే హనుమంతుడి పాత్రలో అజిత్ నటించే అవకాశాలు ఉన్నాయని.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ పాత్రకు సెట్ అవుతారని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారట .మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకి తెలుగులోనే కాదు తమిళ్లో కూడా బాగా క్రేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

శివన్న కు ఓటేస్తారా..?

అయితే మరొకవైపు ఈయనకు కూడా ఇలాంటి పాత్రల్లో నటించిన అనుభవం లేదు అని అందుకే ఇప్పుడు మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. కన్నడ నాట భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న పేరు వినిపిస్తోంది. శివరాజ్ కుమార్ ఇటీవలే కన్నడలో భజరంగీ 1,2 చిత్రాలలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పైగా ఆధ్యాత్మికతవైపు ఆయనకు పట్టు కూడా ఉంది. ఇప్పుడు ఈయన చేస్తే బాగుంటుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.. మరి ఇంతటి కన్ఫ్యూజన్ మధ్యలో ప్రశాంత్ వర్మ ఎవరిని ఈ పాత్ర కోసం ఎంపిక చేస్తారు.? ఆ పాత్రను ఎలా డిజైన్ చేస్తారు..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు