Janvi Kapoor : ఛీఛీ… జాన్వీ ఇలాంటి పని చేస్తుందని ఊహించలేదంటున్న దేవర ఫ్యాన్స్

Janvi Kapoor : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా, అప్డేట్స్ గురించి యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. కానీ ఆ వార్త సారాంశం తెలిసాక ఎన్టీఆర్ అభిమానులు ఛీఛీ.. జాన్వి కపూర్ ఇంతటి పని చేస్తుందని అసలు ఊహించలేదు దేవరా ? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ జాన్వి కపూర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ అయ్యే పని ఏం చేసింది? అనే వివరాల్లోకి వెళితే…

జాన్వి పాత్రలో ఊహించని ట్విస్ట్

దేవర మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయనతో పాటే టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజు కూడా దేవర మూవీలో కీలకపాత్రను పోషిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వి కపూర్ దేవర మూవీతోనే టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ అభిమానులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో ప్రేమాయణం సాగిస్తుందని అంతా ఊహించారు. కానీ తాజాగా బయటకు వచ్చిన వార్తల ప్రకారం జాన్వి కపూర్ పాత్ర అందరు అనుకున్న దానికంటే డిఫరెంట్ గా ఉండబోతోంది.

Devara: Part 1: Jr NTR and Janhvi Kapoor to shoot for a song in Thailand | Filmfare.com

- Advertisement -

ప్లేట్ ఫిరాయించిన జాన్వి…

ఈ సినిమాలో జాన్వి కపూర్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతోంది అనేది ఇన్సైడ్ వర్గాల సమాచారం. అంటే హీరోతో ప్రేమగా ఉంటూనే,  మోసం చేస్తుందా? అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటిదాకా క్యూట్ గా, గ్లామరస్ గా వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించిన జాన్వి కపూర్ రొమాంటిక్ సినిమాలకే ఇప్పటిదాకా పరిమితం అయ్యింది. ఇప్పుడు దేవరతో తన యాక్టింగ్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. తను కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు మంచి నటి కూడా అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న పుకార్లు నిజమైతే జాన్వి పాత్ర థ్రిల్లింగ్ ట్విస్ట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండా గతంలో జస్ట్ గ్లామర్ డాల్ అంటూ ఆమెపై పడిన ముద్ర ఈ సినిమాలో జాన్వి పాత్ర ద్వారా పూర్తిగా చెరిగిపోతుంది. సమాచారం ప్రకారం దేవర సినిమాలో జాన్వి పాత్ర సీట్ ఎడ్జ్ ట్విస్టులు, టర్న్ లతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. దీంతో జాన్వి కపూర్ ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు దేవరా అంటూ షాక్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు