JayaKrishna Ghattamaneni: ఘట్టమనేని వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు

JayaKrishna Ghattamaneni: ప్రతి ఫీల్డ్ లోని వారసత్వం అనేది కామన్ గా ఉంటూ ఉంటుంది. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది వారసతో హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 15 మంది హీరోలు ఉన్నారు. అలానే నందమూరి బాలకృష్ణ తన తండ్రి లెగిసిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు లెగిసిని సూపర్ స్టార్ మహేష్ బాబు కంటిన్యూ చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ ఇలా చాలామంది ఫ్యామిలీస్ నుంచి హీరోలు వచ్చారు. వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నారు. వారసత్వం అనేది కేవలం సినిమా ఓపెనింగ్స్ కు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎంచుకున్న కథలు, వాళ్ళ వ్యక్తిత్వం బట్టి వాళ్లకి సినీ పరిశ్రమలో సరైన లైఫ్ ఉంటుంది. ఇక అక్కినేని అఖిల్ విషయానికి వస్తే దాదాపు ఐదు సినిమాలు వరకు సరైన హిట్టు సాధించలేకపోయాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత చేసిన ఏజెంట్ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు.

Image

- Advertisement -

ఇక సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడు నుంచి తండ్రిని మించిన తనయుడు అనే రేంజ్ కు మహేష్ బాబు ఎదిగారు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా వన్ నేనొక్కడినే అనే సినిమాలో కనిపించాడు. ఇక మహేష్ బాబు అన్నయ్య రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ చేసిన ఎన్నో సినిమాలకు వెనక ఉండి సపోర్ట్ చేశారు. ఇప్పుడు రమేష్ బాబు సన్ జై కృష్ణ ఘట్టమనేని త్వరలో ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వనన్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు