Joker 2 : జోకర్ ఫ్యాన్స్ కు షాక్… ఇదే లాస్ట్ మూవీనా?

Joker 2 : ఐదేళ్ల క్రితం ‘జోకర్’ సినిమా వచ్చి సృష్టించిన బీభత్సం హాలీవుడ్ మూవీ లవర్స్ కి బాగా గుర్తుండే ఉంటుంది. అందరూ తెగ ఇష్టపడే జోకర్ కు ఇదే చివరి సినిమా కాబోతోంది అనే ప్రచారం తాజాగా జోరందుకుంది. దీనికి కారణం జోకర్ సినిమాలో నటించిన హీరోనే. అసలు ఆయన ఈ మూవీ గురించి ఏమన్నాడో తెలుసుకుందాం పదండి.

జోకర్ హీరోకి ఇదే లాస్ట్ మూవీనా?

‘జోకర్’ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఈ చిత్రానికి సీక్వెల్  గా జోకర్ 2ను తీసుకురాబోతోంది. చాలా కాలం గ్యాప్ తరువాత ‘జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్’ పేరుతో సీక్వెల్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈసారి డబుల్ బ్లాస్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ లో హార్లే క్విన్ ఆర్థర్ ఫ్లెక్‌తో కలిసి మరింత దారుణంగా క్రైమ్స్ చేస్తాడు. ఈ చిత్రంలో ఆర్థర్ పాత్రలో ఆస్కార్ అవార్డును దక్కించుకున్న అమెరికా నటుడు జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటిస్తుండగా, హార్లీ క్విన్ పాత్రలో ప్రముఖ గాయని లేడీ గాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జోకర్ ఫ్రాంచైజీలో హీరో ఫీనిక్స్ కు ఇదే చివరి సినిమా కాబోతోంది అనే వార్త ఆయన అభిమానులను టెన్షన్ పెడుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి జరిగిన ప్రమోషన్లలో ఫీనిక్స్ చేసిన కామెంట్స్ అందుకు కారణం.

'జోకర్ 2' చివరిసారిగా జోక్విన్‌ను జోకర్‌గా చూస్తాము

- Advertisement -

జోక్విన్ ఫీనిక్స్ ఇటీవలే ఈ చిత్రం కోసం బరువు తగ్గడంలో ఎదుర్కొన్న ఛాలెంజ్ ల గురించి చర్చించారు.
బుధవారం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా విలేకరుల సమావేశంలో జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్‌లోని డ్యాన్స్ సీక్వెన్స్‌ల కారణంగా ఈసారి బరువు తగ్గడం కష్టమైందని ఆయన వెల్లడించారు. 2019లో రిలీజ్ అయిన జోకర్ కోసం ఆయన అప్పట్లో 24 కిలోల బరువును తగ్గి, ఊహించని విధంగా ఆ పాత్ర కోసం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన వయసు 49 ఏళ్లు. తన వయస్సు బరువు తగ్గించే ప్రక్రియను మరింత సవాలుగా మార్చిందని ఫీనిక్స్ చెప్పుకొచ్చారు. ఫీనిక్స్ దీని గురించి మాట్లాడుతూ “నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. నేను బహుశా దీన్ని మళ్లీ చేయకూడదు. ఆ పరుగు ముగిసే సమయానికి నేను నా గురించి చాలా బాధపడ్డాను. సినిమాకు సంబంధించి ఇంత పెద్ద సాహసం చేసినందుకు నాపై కోపంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో జోకర్ పార్ట్ 3 గనుక ఉంటే అందులో ఫీనిక్స్ నటించే అవకాశం లేదనే టాక్ నడుస్తోంది.

రెండ్రోజుల ముందే ఇండియాలో రిలీజ్

జోకర్ ఫోలీ ఎ డ్యూక్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా, దానికి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ మూవీని ఇండియాలో ప్రకటించిన టైమ్ కంటే రెండ్రోజుల ముందే రిలీజ్ చేస్తుండడం విశేషం. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్  ‘జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్’ ఇండియాలో మాత్రం 2024 అక్టోబరు 2, బుధవారం రిలీజ్ అవుతుందని వార్నర్ బ్రదర్స్ ఇండియా వెల్లడించింది. భారతదేశంలో ఈ చిత్రాన్ని ముందుగా విడుదల చేయాలనే నిర్ణయం వెనుక వార్నర్ బ్రదర్స్ ఇండియా స్ట్రాటజీ వేరేగా ఉంది. అక్టోబర్ 2న జాతీయ సెలవుదినమైన గాంధీ జయంతి రోజున సినిమా థియేటర్‌లలోకి వస్తే బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు