Jr.NTR: వయసులో తనకంటే పెద్ద హీరోయిన్ తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ బ్యూటీ ఎవరంటే..?

జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న చాలా కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరు దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా మార్మోగిపోతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించారు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

అలాగే తన సినిమాల ద్వారా ఎందరో కొత్త హీరోయిన్లను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాలలో హీరో కంటే హీరోయిన్ల వయసే తక్కువగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే కూతురు వయసు ఉన్న హీరోయిన్లతో కూడా సినిమాలు చేశారు. చాలా రేర్ గా మాత్రమే వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు జతకడుతుంటారు. అయితే ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారని మీకు తెలుసా..? దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్టీఆర్ రెండుసార్లు తనకంటే ఏజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ తో రొమాన్స్ చేశారు.

ఆ హీరోయిన్ మరెవరో కాదు భూమిక చావ్లా. దర్శక దీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ – భూమిక స్క్రీన్ షేర్ చేసుకున్నారు. విజయేంద్ర కుమార్ నిర్మించిన ఈ చిత్రం 2003లో విడుదలై ఎన్ని సంచలనాలను నమోదు చేసిందో మనం ప్రత్యక్షంగా చూసాం. బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది.

- Advertisement -

ఈ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ – భూమిక సాంబ సినిమాలో కలిసి నటించారు. వి.వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారు.

అయితే 20004లో విడుదలైన ఈ సాంబ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీరిద్దరి మధ్య ఆల్మోస్ట్ ఐదేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. ఈ వయసు వ్యత్యాసం వెండితెరపై ఇద్దరి మధ్య అస్సలు కనిపించదు. చూడడానికి చాలా యంగ్ గా ఉండడంతో భూమికని ఈ సినిమాలలో హీరోయిన్ గా ఎంచుకున్నారు దర్శకులు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు