Devara : దేవర,వర.. ఇద్దరు కాదు.. ముగ్గురా? అందుకోసమే మూడోవాడ్ని దాచారా?

Devara : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర” ట్రైలర్ రెండు రోజుల కింద యూట్యూబ్ లో విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన దేవర ట్రైలర్ నెట్టింట నిమిషాల వ్యవధిలోనే టాప్ లో ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర ట్రైలర్ యూట్యూబ్ లో మిశ్రమ స్పందన అందుకుంటుంది. దేవర ట్రైలర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని నందమూరి అభిమానులు అనుకోగా, ఆ ఫ్యాన్స్ ఆశించిన అంచనాలకు తగ్గట్టు మాత్రం లేదన్న మాట వినిపిస్తుంది. పైగా ట్రైలర్ లో అక్కడక్కడా, ఆచార్య ఛాయలు, ఆంధ్రావాలా స్టోరీ లైన్ వినిపించిందని కూడా నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. అయితే దర్శకుడు కొరటాల శివ (Koratala siva) మాత్రం అసలు స్టోరీ మొత్తం రెండో భాగంలో ఉంచి, ఈ పార్ట్ లో పాత్రల ఇంట్రడక్షన్, వాటి స్వభావాల్ని పరిచయం చేయనున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.

Junior NTR playing a triple role in Devara movie

దేవర ఇద్దరు కాదా? ముగ్గురా?

అయితే దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యాక దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ (Jr NTR) కనిపించబోతున్నాడని చాలామంది అనుకున్నారు. అయితే ఆడియన్స్ కి తెలియని మూడో పాత్ర కూడా ఉందని కొరటాల చిన్న హింట్ ఇచ్చాడని కామెంట్స్ వస్తున్నాయి. దేవర ట్రైలర్ లో గమనిస్తే.. సముద్రంలో పడవలపైన ఫైట్ జరిగే క్రమంలో అక్కడ ఓ అజ్ఞాత వ్యక్తి రెండు కత్తులతో పూర్తిగా ముసుగువేసుకుని నిల్చోవడం చూసే ఉంటారు. ఆ సమయంలో వెనకాల పడవలు తగలబడుతూ ఉండగా, ఆ నిప్పుల్లో భయానకంగా ఆ సీన్ ఉంది. అయితే ఆ సీన్ లో ఉంది దేవరనే అని అందరూ అనుకున్నారు. ఇక ఈ సీక్వెన్స్ ప్రీ క్లైమాక్స్ లో ఉంటుందని సమాచారం. కానీ తాజాగా అది ఎన్టీఆర్ ఇంకో పాత్ర అని కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

అందుకోసమే ఆ పాత్ర సీక్రెట్ గా ఉంచారా?

అయితే సినిమాలో ఉన్న దేవర, వర పాత్రలు కాకుండా మరో పాత్ర కూడా ఉందా అన్న అనుమానం వస్తుంది. ఈ లెక్కన దేవరలో రెండు పాత్రలు అన్నదమ్ములవి కాగా, మరో కనిపించని పాత్రే తండ్రి పాత్ర అయి ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. అయితే బహుశా అది వేరే స్టార్ హీరో స్పెషల్ రోల్ కూడా అయి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఆ పాత్ర ఉంటే, అది దేవర (Devara) రెండో పార్ట్ లో మాత్రమే చూపించే ఛాన్స్ ఉందన్న మాట వినిపిస్తుంది. మరి వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇక దేవర రిలీజ్ కి రెండు వారాలు మాత్రమే ఉండగా, సెప్టెంబర్ 27 న పాన్ ఇండియా భాషల్లో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు