Jr.ntr: జూనియర్ ఎన్టీఆర్ కి ఆ స్టార్ డైరెక్టర్ కి ఇప్పటికీ మాటల్లేవా..?

Jr.ntr: RRR చిత్రంతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించారు.. పాన్ ఇండియా హీరోగా భారీ క్రేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. తన నటనతోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు.. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు..

ఎన్టీఆర్ కేవలం సినిమాలలోనే కాదు బయట కూడా అందరితో సరదాగానే ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ కి ఒక స్టార్ డైరెక్టర్ తో ఇప్పటికీ మాటల్లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు యాక్షన్ సినిమాలకు, వైలెన్స్ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం దమ్ము.. ఈ సినిమా చాలా దారుణమైన ట్రోలింగ్ కి గురైంది. దీంతో ఎన్టీఆర్ అప్పటివరకు ఉన్న ఇమేజ్ ను కూడా పోగొట్టుకున్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బోయపాటి మధ్య అసలు మాటల యుద్ధం మొదలయ్యిందని తెలుస్తోంది. ఎందుకంటే ముందుగా ఎన్టీఆర్ కి చెప్పిన దమ్ము కథ ఒకటని.. బోయపాటి శ్రీను తీసిన స్టోరీ మరొకటి అంటూ వార్తలు వినిపించాయి. అందువల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని టాక్ కూడా వినిపించింది .ఇక కథలోని మార్పులు కూడా ఎన్టీఆర్ కు చెప్పకుండానే చేశారట డైరెక్టర్ బోయపాటి శ్రీను…

- Advertisement -

అప్పటివరకు కూడా చాలా దారుణమైన ప్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్.. దమ్ము సినిమా కూడా భారీ ఫ్లాప్ కావడంతో బోయపాటి మీద చాలా కోపంతో ఫైర్ అయినట్లు సమాచారం. దీంతో అప్పటినుంచి ఎన్టీఆర్ బోయపాటి శ్రీను మధ్య మాటలు లేవని తెలుస్తోంది. మరి ఈ విషయం పైన ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు..

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు