Akhanda2 : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి రేపటితో పూర్తి అయిపోతుంది. గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు జూన్ 4 వెలువడనుండగా, ఫలితాల తర్వాత మరో వారం రోజుల్లో బాలయ్య పూర్తిగా ఫ్రీ అయిపోతాడు. ఇక అతి త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలిసిందే. ఇక ఆల్రెడీ బాలయ్య బాబీ కొల్లి తో సినిమా చేస్తుండగా, టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఆ సినిమా దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఆ సినిమా ఆగష్టు కల్లా పూర్తి చేసి తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు బాలయ్య. ఇక నటసింహ బాలకృష్ణ 110వ చిత్రంగా “అఖండ-2” (Akhanda2) దాదాపు ఖాయమైనట్లే అని సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక మూడేళ్ళ కింద వచ్చిన అఖండ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఎన్నికల తర్వాత బాలయ్య నుంచి కూడా లైన్ క్లియర్ గా ఉండటంతో? ఎలాంటి సందేహాలు లేకుండా ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటి ఆ సినిమా పనుల్లో తలామునకలై ఉన్నారు. ప్రీ ప్రొడక్షణ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బాలయ్య కోసం అప్పుడే హీరోయిన్ వేట మొదలైపోయిందని తెలుస్తోంది.
బాలయ్య సినిమా కోసం ఇద్దరు హీరోయిన్ల పోటీ?
ఇక సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకవడం ఇబ్బంది గా ఉండటంతో బోయపాటి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ప్రధానంగా ఇద్దరి భామల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టాలీవుడ్ లో సీనియర్లు అయిపోయిన స్టార్స్ కాజల్ అగర్వాల్, అంజలి పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా బాలయ్య తో ఇప్పటికే సినిమాలు చేసారు. డిక్టెటర్ లో అంజలి, భగవంత కేసరి లో కాజల్ అగర్వాల్ బాలయ్యకి జోడీగా నటించారు. డిక్టెటర్ ప్లాప్ అయినా రీసెంట్ గా రిలీజ్ అయిన భగవంత్ కేసరి మాత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్య ఆ ఇద్దరిలో ఎవరి వైపు చూస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
డిసైడ్ చేసేది బాలయ్యే?
ఇక ఈ ఇద్దరు హీరోయిన్లలో ఒకర్ని డిసైడ్ చేయడం బాలయ్య చేతుల్లోనే ఉందని సమాచారం. ఇదిలా ఉండగా అంజలితో బాలయ్య కి మంచి ప్రెండ్షిప్. ఇద్దరు ఎంత క్లోజ్ గా ఉంటారు? అన్నది ఇటీవలే ఓ సందర్భంలో ప్రూవ్ అయింది. అది కాస్త నెగిటివ్ గా స్ప్రెడ్ అయినా అంజలి వివరణ ఇవ్వడంతో అదంతా తప్పుడు ప్రచారమని తనకి-బాలయ్య కి మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పే ప్రయత్నం చేసింది. ఇక కాజల్ తో మరీ అంత చనువు కాకపోయినా? సక్సెస్ ఇచ్చిన హీరోయిన్ గా గుర్తింపు ఉంది. మరి వీళ్లిద్దరిలో బాలయ్య ఆప్షన్ ఎవరు? అవుతారో చూడాలి. దీనిపై జూన్ 10న క్లారిటీ వస్తుందని దర్శకుడి సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. ఆ రోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా విషయం అధికారికంగా చెబుతారని అంటున్నారు. అయితే బాలయ్య సినిమాలో హీరోయిన్ ఈ ఇద్దరిలో ఒకరు లేదా, కొత్త హీరోయిన్ ని కూడా తీసుకునే అవకాశం ఉంది.