Kajal : త్రిష స్థానాన్ని కొట్టేసిందా ?

కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అజిత్ నుంచి తాజాగా వస్తున్న చిత్రం తునీవు, తెలుగులో తెగింపుగా రిలీజ్ అవుతుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుగా ఈ నెల 11వ తేదీన థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంపై డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

AK62 అనే వర్కింగ్ టైటిల్ తో విడుదలకు ముందు పనులను పూర్తి చేసుకుంటుంది ఈ చిత్రం. అయితే దీనిలో అజిత్ జోడీగా త్రిష నటిస్తుందని కొన్ని రోజుల నుంచి తెగ ప్రచారం జరిగింది. ఇప్పటికే త్రిష తో విఘ్నేష్ చర్చలు జరిపారని, హీరోయిన్ గా ఆమె పేరును ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ కుమార్ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.

త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. త్రిషకు ఉన్న బిజి షెడ్యూల్ కారణంగా ఈ చిత్రం చేయలేకపోతుందట. దీంతో దర్శకుడు విఘ్నేష్ శివన్ చివరిగా కాజల్ అగర్వాల్ ను ఫిక్స్ చేశారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా అజిత్ తో కాజల్ అగర్వాల్ ఇది వరకే వివేకం అనే సినిమాలో కలిసి నటించిన సంగతి విధితమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు