Kajal Agarwal : సత్యభామ సినిమా పోస్టర్స్ డిలీట్ చేసిన కాజల్.. అతనే కారణమా?

Kajal Agarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్, చందమామ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు వరుస సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.. రీసెంట్ గా లేడి ఓరియేంటెడ్ మూవీ సత్యభామ తో ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.. ఇక ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా నిన్న అర్ధ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.. ఇదిలా ఉండగా ఈ సినిమా పోస్టర్స్ ను కాజల్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి డిలీట్ చేసింది.. ఎందుకు డిలీట్ చేసింది అనేది మాత్రం తెలియలేదు కానీ ఈ వార్త నెట్టింట దుమారం రేపుతుంది..

కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగోడుతుంది.. ఒకటి రెండు సినిమాలు ప్రత్యేక పాత్రల్లో నటించింది.. సత్యభామ లేడీ ఓరియేంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ప్రమోషన్స్ ను కాజల్ ఓ రేంజులో చేసిందన్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి యాక్షన్ సీన్లలో అదరగొట్టింది.. మొత్తానికి కాజల్ యాక్షన్ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి.. సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అయితే ఈ సినిమా పోస్టర్స్ ను కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ ను డిలీట్ చేసింది.. ఎందుకు అలా చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. కానీ నిర్మాతతో రెమ్యూనరేషన్ విషయంలో గొడవలు పడిందనే వార్త మాత్రం షికారు చేస్తుంది..

Kajal deleted Satyabhama movie posters.. is he the reason?
Kajal deleted Satyabhama movie posters.. is he the reason?

ఈ వార్త ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది.. దీనిపై కాజల్ స్పందిస్తే గానీ అసలు మ్యాటర్ ఏంటనేది తెలియదు.. ఇక పోతే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.. మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. అంతేకాదు భారీ వ్యూస్ తో దూసుకుపోతుందని తెలుస్తుంది.. కాజల్ పెళ్లి చేసుకొని ఒక బాబుకు తల్లయింది.. అందంలో ఎటువంటి మార్పు లేదు.. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ప్రత్యేక పాత్రల్లో నటిస్తుంది.. రెండు, మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమాల గురించి అనౌన్స్ చేయబోతుందని టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు