Kalki 2898 AD : దీపిక పాత్రలో నటించే గోల్డెన్ ఛాన్స్ మిస్… అందుకే కదా ఈ హీరోయిన్ ను ఐరన్ లెగ్ అనేది?

Kalki 2898 AD : ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా జూన్ 27న ఆడియన్స్ ముందుకు వచ్చిన కల్కి 2898 ఏడి మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ఉండడంతో మూడవ రోజు కూడా కలెక్షన్ల ఊచకోత కోస్తోంది. ఇక మరోవైపు సినిమాలో నటించిన నటీనటులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇలాంటి అద్భుతమైన సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ ను ఓ హీరోయిన్ చేజేతులా వదిలేసిందట. దీంతో అందుకే కదా ఈమెని ఐరన్ లెగ్ అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వార్త తెలిసిన నెటిజన్లు. ఇంతకీ కల్కి మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని వదులుకున్న హీరోయిన్ ఎవరు ? అనే వివరాల్లోకి వెళితే…

గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న హీరోయిన్

కల్కి సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొనే పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. సుమతిగా ఆమె కల్కిని తన గర్భంలో మోయడంతో స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అయితే ఇలాంటి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేజార్చుకుందట. ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతున్న ఓ వార్త ప్రకారం ముందుగా సుమతి పాత్ర కోసం పూజ హెగ్డేని అనుకున్నారట మేకర్స్. కానీ పూజ హెగ్డే మాత్రం చేతిలో సినిమాలు లేకపోయినా ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. దీంతో ఆ అవకాశం దీపికను వరించింది. అందులో ఆమె ప్రెగ్నెంట్ ఉండి కూడా నటించడం, సినిమాలో మంచి నటనను కనబరచడంతో దీపికాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఒకవేళ పొరపాటున పూజ హెగ్డే ఈ పాత్రను ఒప్పుకొని ఉంటే కచ్చితంగా సినిమాకు మైనస్ అయ్యి ఉండేదని అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

Oh Pooja Hegde, What A Downfall

- Advertisement -

ఎందుకు రిజెక్ట్ చేసిందంటే…

నిజానికి ఇటీవల కాలంలో పూజ హెగ్డే కు అవకాశాలు కరువయ్యాయని చెప్పాలి. రాధేశ్యామ్ సినిమా తర్వాత ఈ బ్యూటీ కెరీర్ పూర్తిగా మునిగిపోయింది. అటు నార్త్ నుంచి ఇటు సౌత్ దాకా ఆమెకసలు అవకాశాలు అనే మాటే వినిపించకుండా పోయింది. రీసెంట్ గా సూర్య సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే పట్టేసింది అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిపై ఇంకా అఫిషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇక కల్కి మూవీలో పూజ హెగ్డే నటించకపోవడానికి కారణం రాధేశ్యామ్ అని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ రాధేశ్యామ్ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. పైగా అందులో పూజా హెగ్డే నటనపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అప్పటి నుంచి ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో పూజ హెగ్డేపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. అయితే కల్కిలో నటించే ఛాన్స్ ను ఆమె వదిలేసుకుంది అనే రూమర్లు చూశాక నెటిజన్లు అందుకే కదా ఆమెని ఐరన్ లెగ్ అని అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు