Kalki 2898 AD : కల్కితో అంతా హ్యాపీ… ఆ ఒక్క హీరో ఫ్యాన్స్ తప్ప

Kalki 2898 AD : ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి గురించే చర్చ నడుస్తుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి? ఎవరెవరు ఎలా నటించారు? సినిమాలోని సర్ప్రైజ్ లు ఏంటి? అనే విషయాలను సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. కల్కి మూవీతో అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఆ ఒక్క హీరో అభిమానులు మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. నిజానికి ఒక్కరు అనడం కంటే ఇద్దరు అని చెప్పవచ్చు. మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరు? వాళ్ళ అభిమానులు ఎందుకు కల్కి వల్ల హ్యాపీగా లేరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్

కల్కి మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ఇందులో కీలకపాత్రలు పోషించిన నటీనటుల గురించి రోజుకో రూమర్ రావడం మొదలైంది. అందులో భాగంగానే ఇందులో సీనియర్ ఎన్టీఆర్ మరోసారి కృష్ణుడిగా దర్శనం ఇస్తారని రూమర్లు వచ్చాయి. దీంతో కల్కి మూవీని తెరపై చూడడానికి, అందులో సీనియర్ ఎన్టీఆర్ ను కృష్ణుడిగా దర్శించుకోవడానికి ఇటు యంగ్ టైగర్ అభిమానులతో పాటు అటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. ఆయనను ఎంతగానో ఆరాధించే తెలుగు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఆయన్ని కల్కి సినిమాలో చూస్తామా ? అని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. ఎదురు చూసిన ఆ క్షణం ఈరోజు రానే వచ్చింది. కానీ తాము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సినిమాలో ఎన్టీఆర్ లేకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది.

Kalki 2898 AD advance booking: Prabhas, Deepika Padukone-starrer projected to cross ₹55.05 crore in India - Hindustan Times

- Advertisement -

సినిమాలో శ్రీకృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ కనిపించలేదని ఇప్పటికే మూవీని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. కృష్ణుడిని చూపించే సీన్ లో బ్లర్ చేశారని కామెంట్ చేస్తున్నారు. దీంతో అసలు నాగ్ అశ్విన్ ఇలాంటి ట్విస్ట్ ఎందుకు ఇచ్చాడు? కావాలనే ఈ పార్ట్ లో శ్రీకృష్ణుడిని బ్లర్ చేసి చూపించారా? రాబోయే పార్ట్ లో ఆయనను కరెక్ట్ గా చూపిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే శ్రీకృష్ణుని బ్లర్ గా చూపించడం అనేది కావాలనే అలా చూపించారా? లేక టెక్నికల్ ఇష్యూనా ? అనే విషయంపై క్లారిటీ లేదు. ఎలాగూ త్వరలోనే నాగ్ అశ్విన్ అండ్ టీం ప్రెస్ మీకు హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఈ ప్రశ్నకు ఆయన ఎన్టీఆర్ అభిమానులకు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

డిసప్పాయింట్ చేసింది నాగీ కాదు..

ఇక కల్కి సినిమా వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు నాని ఫాన్స్ కూడా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో నాని కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడని రూమర్లు జోరుగా నడిచాయి. కానీ తీరా చూస్తే సినిమాలో ఆయన లేడు. నిజానికి ఇవన్నీ రూమర్లే కాబట్టి చాలామంది నాని సినిమాలో లేకపోవడాన్ని లైట్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా డిసప్పాయింట్ చేసింది నాగీ కాదు రూమర్స్. సో మొత్తానికి ఈ రూమర్స్ వల్ల వచ్చిన డిసప్పాయింట్మెంట్ ను పక్కన పెడితే మిగతా అంతా బాగున్నట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు