Kalki Pre Release Event : ప్రీ రిలీజ్ ఈవెంటా? ఇండోర్ ప్రెస్ మీటా? వేడుకపై ఫ్యాన్స్ అసంతృప్తి

Kalki Pre Release Event : పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ స్టార్ స్టడెడ్ ఈవెంట్ గురించి ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకపై ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ ను లైవ్ లో చూసిన మూవీ లవర్స్ కూడా ఇది ప్రీ రిలీజ్ ఈవెంటా? లేక ఇండోర్ ప్రెస్ మీటా? అన్పించిందని సెటైర్లు వేస్తున్నారు.

హిందీ వాళ్ళ కోసమే ఈవెంట్ ?

సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు తెరపైకి వస్తున్నాయి అంటే అందులో నటిస్తున్న బిగ్ స్టార్స్ అందరూ ఒకే వేదికపై కనిపించే అరుదైన అవకాశం దక్కుతుంది. పైగా భారీ ఎత్తున ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం వల్ల అందరూ హీరోల అభిమానులు ఫుల్లుగా దిల్ ఖుషి అవుతారు. కానీ కల్కి మూవీ ఈవెంట్ విషయంలో మాత్రం ఇది డిఫరెంట్ గా జరిగింది. నిజానికి ఈ సినిమాలో నటిస్తున్న వారంతా దిగ్గజ నటీనటులే కావడంతో, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్ వంటి స్టార్స్ ను కన్నుల పండుగగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూడొచ్చని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అందరి ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం హిందీ మూవీ లవర్స్ కు సినిమాపై ఆసక్తిని కల్పించడమే ఈవెంట్ లక్ష్యంగా వ్యవహరించారు చిత్ర బృందం.

Kalki 2898 AD pre-release event in Mumbai highlights: Kalki 2898 AD event Live Streaming | Kalki 2989 AD release date in India, cast, trailer, budget | Telugu News - News9live

- Advertisement -

ఈవెంట్ మేనేజ్మెంట్ కి డబ్బులు ఇవ్వలేదా?

నిజానికి దీన్ని గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనడం కంటే ఇండోర్ ప్రెస్ మీట్ లాగా అనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈవెంట్ నిర్వహణ పెద్దగా ఆకట్టుకోలేదు. కెమెరాలు సరిగ్గా సెటప్ కాకపోవడంతో సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారు తమ అభిమాన నటులను స్పష్టంగా చూడడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాస్తవానికి డార్క్ థీమ్ తో రావాలని కల్కి టీం ప్లాన్ చేసింది. అది బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు.

ఇక్కడ ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాలి. వాళ్ళు ఇంకా ఈవెంట్ కోసం సరిగ్గా సిద్ధం కానట్టుగా అనిపించింది. వాళ్ల మేనేజ్మెంట్ ఎలా ఉందంటే వేడుకకు హాజరైన జర్నలిస్టులను సైతం నిరాశలో ముంచేశారు. స్టార్స్ అందరూ కళ్ళముందే ఉన్నప్పటికీ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చాలామందికి పెద్దగా ఎగ్జైటింగ్ ఫీలింగ్ రాలేదు. అదే సౌత్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే సాంకేతిక అంశాలైనా, ఏర్పాట్లైనా నెక్స్ట్ పదేళ్ల వరకు గుర్తుండేలా చేస్తారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చినప్పటికీ వాళ్లను మేనేజ్ చేసే విధంగా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లోనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు. కానీ ముంబైలో మాత్రం ఇలాంటి ఈవెంట్ల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది ఫ్యాన్స్ గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహిస్తే దీపికాకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇలా ముగించేశారేమో అని సరిపెట్టుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు