Kalki Team Remunerations : రెమ్యునరేషన్ల కోసమే సినిమాలో సగం బడ్జెట్… ఎవరెంత వసూలు చేశారంటే?

Kalki Team Remunerations : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898’ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. సినిమా బడ్జెట్ లో సగం అందులో నటించిన స్టార్ హీరోలకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికే సరిపోయిందని సమాచారం. మరి ప్రభాస్, దీపికా, కమల్, అమితాబ్ మిగతా టీమ్ ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

250 కోట్లు రెమ్యునరేషన్లకే…

ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటీనటులు కూడా నటిస్తున్నారు. కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో అద్భుతమైన విజువల్స్ తో భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే కల్కి 2898 ఏడీ సినిమాలోని భైరవ మొదటి పాటను, రెండు ట్రైలర్లను విడుదల చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే నటీనటుల రెమ్యూనరేషన్ పై ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు పూర్తి కావడానికి సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సెలబ్రిటీలు సహజంగానే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. సినిమాలో సగం బడ్జెట్ అందులో నటించిన నటినటులకే పారితోషికం ఇవ్వడానికే సరిపోయిందని అంటున్నారు. మరి ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసుకుందాం పదండి.

Kalki 2898 AD' trailer breakdown: From 'Dune' to 'Blade Runner', here are the sci-fi inspirations in Prabhas' film - The Hindu

- Advertisement -

‘కల్కి 2898 ఏడీ’ కోసం ప్రభాస్ రూ. 150 కోట్ల రూపాయలు అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోనే కాకుండా ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరో ప్రభాస్. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి దీపికా పదుకొణె కల్కి సినిమాలో నటించడానికి 20 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇందులో భారతీయ సినిమాకి చెందిన ఇద్దరు దిగ్గజ స్టార్ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో కనిపించేందుకు అమితాబ్ 20 కోట్లు, కమల్ 20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా కనిపించింది. ఆమె తన పాత్రకు 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇతర ఆర్టిస్టులకు కూడా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ లో మొత్తం రెమ్యునరేషన్ 250 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. జూన్ 27న కల్కి భారీ ఎత్తున విడుదలవుతోంది.

హైప్ పెంచేసిన ట్రైలర్

కల్కి మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసింది. ఈ ట్రైలర్ ను చూశాక కల్కి ద్వారా మరోసారి టాలీవుడ్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు