Kalki: హోస్ట్ గా మారనున్న పాన్ ఇండియా హీరో, అప్పుడు ఇలానే అన్నారు ఇప్పుడైన అవుతుందా

Kalki: ఈ రోజుల్లో ఒక హీరోగా నిలబడటం అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే తెలుగు సినిమా ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక సినిమా చేశాము అనంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ ని ఆకట్టుకోవాలి. లేదంటే ఆ సినిమా థియేటర్ లో రెండు రోజులు కూడా ఆడటం కష్టమని చెప్పాలి. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కెరియర్ మొదలుపెట్టిన చాలామంది నేడు హీరోలుగా ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. ఇకపోతే చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు తేజ.

నందిని రెడ్డి దర్శకత్వంలో హీరోగా

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఓ బేబీ. సమంత ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో తేజ ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఇక్కడితోనే తేజకు మంచి పేరు వచ్చింది. ఇక్కడినుంచి తేజ హీరోగా చిన్న చిన్న అడుగులు వేయటం మొదలుపెట్టాడు. ప్రతి హీరోకి ఒక సూపర్ హిట్ ఇచ్చే దర్శకులు ఉంటారు. అలా తేజ విషయానికొస్తే ప్రశాంత్ వర్మ తేజను చేసాడని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని తేజ మాట్లాడుతూ ఎన్టీఆర్ కు రాజమౌళి, రవితేజ కు పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కు సుకుమార్, నాకు ప్రశాంత్ వర్మ అంటూ గర్వంగా చెప్పుకుంటాను అని సందర్భంలో అన్నాడు.

 hanuman actor teja sajja

- Advertisement -

హనుమాన్ సినిమాతో ప్యాన్ ఇండియా గుర్తింపు

సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2024 సంక్రాంతికి సంబంధించి చాలా పెద్ద పెద్ద సినిమాలు పోటీల్లో నిలబడ్డాయి. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా పైన అందరికీ ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అయితే ఆ సినిమా మొదటి నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వటం వలన కలెక్షన్ పైన కొంచెం ఎఫెక్ట్ పడింది. పోతే ఈ తరుణంలో హనుమాన్ సినిమా మౌత్ టాక్ తో హీట్ అయింది. మెల్లమెల్లగా ఈ సినిమాకి థియేటర్లు కూడా పెరగడం మొదలయ్యాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాతోనే తేజ కి బ్రేక్ వచ్చింది. తేజను ఒక పాన్ ఇండియా హీరోగా ఈ సినిమా నిలబెట్టింది.

కల్కి కోసం హనుమాన్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీ లో జరగనుంది. ఈవెంట్లో తేజ హోస్ట్ కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. గతంలో ఆది పురుష అనే సినిమాకి తేజ హోస్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు అది జరగలేదు ఇప్పుడు జరుగుతుందని చాలామంది అనుకుంటున్నారు ఇది తెలియాలంటే ఇంకొద్దిసేపు వెయిట్ చేయడం తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు