Kalki2898 AD : భారీ వేడుకలో ఆ రోజున అభిమానుల మధ్య కల్కి సాంగ్ రిలీజ్..!

Kalki2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరక్కుతున్న కల్కి2898AD చిత్రం కోసం పాన్ ఇండియా వైడ్ గా ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఈ ఎక్స్పెరిమెంట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ మొదలు కొని టీజర్ దాకా అంచనాలని పెంచుతూనే పోతుంది ఈ సినిమా. రెండేళ్లుగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ హైప్ ని అమాంతం పెంచేస్తుంది. ఇక చిత్ర యూనిట్ కూడా రెండు నెలల టైం కూడా లేకపోవడంహో ప్రమోషన్లు ఆల్రెడీ మొదలు పెట్టేసారు. అందులో భాగంగా రీసెంట్ గా ప్రభాస్ మొన్నామధ్య ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టోరీ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసిన పోస్ట్ ని చూసి అందరూ ప్రభాస్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెబుతున్నాడని అనుకుంటే, కల్కి లో బుజ్జి గురించి చెప్పి షాకిచ్చాడు. కానీ ఆ ఇంస్టాగ్రామ్ స్టేటస్ తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా ప్రకంపనలు రేపాడు. సినిమాని ఒక్కసారిగా అటెన్షన్ లో ఉంచాడు ప్రభాస్.

బుజ్జితో మొదలైన ప్రమోషన్లు…

ఇక నిన్న రిలీజ్ చేసిన కల్కి స్క్రాచ్ ఎపిసోడ్4 వీడియో లో బుజ్జిని పరిచయం చేసారు మేకర్స్. అందులో చిన్నపాటి మెషిన్ ని చూపించి బుజ్జి బ్రెయిన్ గా చెప్పగా, ఆ బుజ్జి పేరు మీదున్నది భైరవ స్పెషల్ వాహనంగా చూపించబోతున్నారు. ఇక ఈ బుజ్జి పాత్రకి మహానటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించడం జరిగింది. ఇక రిలీజ్ చేసిన వీడియో లో ‘మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. బుజ్జిని కూడా ఓ బ్రెయినే అలా కంట్రోల్ చేస్తుంది’ అని చూపించారు. ఇక బుజ్జి మనిషిలానే మాట్లాడుతోంది.. ‘సచ్చినోడా’ అంటూ తిట్లు కూడా తిడుతోందని ఫన్నీ గా చూపించారు. ఇక బుజ్జిని తయారు చేసిన వారిని కూడా ఈ వీడియోలో పరిచయం చేశారు. అలాగే ‘బుజ్జి అంటే వాహనం మాత్రమే కాదు.. ఇదో సూపర్ హీరో’ అని కూడా చెప్పారు. ఇక బుజ్జి పూర్తి రూపాన్ని మే22న చూపిస్తామని మేకర్స్ వీడియోలో తెలిపారు. అలాగే ఆరోజున మరో సప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Kalki2898AD movie First song releasing on may 22

- Advertisement -

కల్కి ఫస్ట్ సాంగ్ ఈ రోజున?

ఇక కల్కి 2898 ఏడి (Kalki2898 AD) సినిమా ప్రమోషన్లు బుజ్జి వీడియోతో మొదలుపెట్టేయగా, ఇక నుండి వారానికో క్రేజీ అప్డేట్ తో సినిమాపై రచ్చ లేపనున్నారు మేకర్స్. నాగ్ అశ్విన్ ఈ సినిమాను భారతదేశంలోనే అత్యంత భారీ ఖర్చుతో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా కల్కి యొక్క ఫస్ట్ సాంగ్ ని మే 22న హైదరాబాద్ లో ఓ భారీ వేడుకని అభిమానుల మధ్య నిర్వహించబోతున్నారని సమాచారం. ఆ వేడుక లో కల్కి నుండి పలు రకాల సప్రైజ్ లు, అప్డేట్ లు ఇవ్వనుండగా, ఫస్ట్ లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ వేడుకలో దాదాపు చిత్ర యూనిట్ అంతా పాల్గొనబోతున్నారట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తుండడంతో ఇప్పటికే అంచనాలు మించిపోయాయి. ఇక బాలీవుడ్ హీరోయిన్లు దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా. ఈ భారీ బడ్జెట్ తో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని జూన్ 27న వరల్డ్ వైడ్ గా 22 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు