Kalki2898AD : సరిగ్గా 26 రోజులు.. ఓవర్సీస్ పై మేకర్స్ స్పెషల్ ఫోకస్..  అక్కడ బుకింగ్స్ ఆ రోజునుండి ఓపెన్…

Kalki2898AD : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో తెరకెక్కుతున్న సినిమా కల్కి2898AD. ఈ సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లోనే  కాకుండా ఏకంగా 22 భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ మైథలాజికల్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీమహావిష్ణు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే భైరవ అనే మరో రోల్ లో కూడా నటించాడు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ చిత్రంలో అశ్వద్ధామ పాత్ర చేశారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్స్ ప్రభాస్ కి జోడీగా నటించారు. ఇక ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసకోగా, ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వుంది. ఇక పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని చిత్ర యూనిట్ స్పెషల్ గా ఓవర్సీస్ మార్కెట్ పై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Kalki2898AD overseas bookings open on 8th June

అక్కడే మేకర్స్ స్పెషల్ ఫోకస్..

ఇక కల్కి 2898AD సినిమా (Kalki2898AD) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, రిలీజ్ ఇంకా 26 రోజుల టైం ఉంది. ఆల్రెడీ సినిమా మీద రోజు రోజుకి బజ్ అయితే పెరిగి పోతూ ఉండగా, రీసెంట్ సినిమా నుండి వచ్చిన యానిమేసన్ సిరీస్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది. దాంతో అంచనాలు ఇంకా పెరిగి పోగా ఇంకా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ పై తెలుగు రాష్ట్రాల్లోనే, కాకుండా పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే కల్కి మేకర్స్ అన్నిటికంటే ఓవర్సీస్ మార్కెట్ పైనే ఎక్కువ ఫోకస్ చేసారని తెలుస్తుంది. ఇక కల్కిని సినిమా ఓవర్సీస్ లో కొన్ని సెలెక్టివ్ ఏరియాలలో టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు.

- Advertisement -

ఆరోజునుండే బుకింగ్స్ ఓపెన్..

ఇక ఓవర్సీస్ లో ఆల్రెడీ కొన్ని చోట్ల కల్కి బుకింగ్స్ ఓపెన్ కాగా, అమెరికాలో సినిమా డల్లాస్ ఏరియాలో సినిమా ప్రీమియర్స్ షోల బుకింగ్స్ ను మెల్లిమెల్లిగా ఓపెన్ చేయగా, అక్కడ బుకింగ్స్ యమ జోరుగా సాగుతూ, ఓపెన్ చేసిన స్క్రీన్స్ లో బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయట. అయితే సినిమా ఫుల్ బుకింగ్స్ అన్నీ కూడా జూన్ 8 తర్వాత ఓపెన్ కాబోతున్నట్లు సమాచారం. మొత్తం మీద సినిమా కొంత కొంత గ్యాప్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సినిమా కాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా ఇక ట్రైలర్ కూడా క్లిక్ అయితే సినిమా మీద బజ్ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఇక కల్కి మ్యానియా ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది. అన్ని కుదిరితే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే ఛాన్స్ కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు