Kalki2898AD : థియేటర్లో టికెట్ల కంటే సమోసాలకే ఎక్కువ లాభం? ఎంతో తెలుసా?

Kalki2898AD : టాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా విడుదలైన సినిమా కల్కి2898AD. నెలన్నర కింద విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఫస్ట్ డే నుండే రోజుకో రికార్డు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా మైథలాజికల్ ఫిక్షనల్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా థియేటర్లలో విడుదలై భారీ భీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల లిమిటెడ్ కలెక్షన్లు సాధిస్తూనే ఉంది. కల్కిలో రెబల్ స్టార్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల స్టార్ డమ్ కల్కి ఓపెనింగ్స్ కి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసిన ఈ సినిమా మల్టిప్లెక్స్ లాంటి థియేటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది.

Kalki2898AD's movie is more profitable in canteen collections than theater collections

థియేటర్లలో టికెట్ల కంటే క్యాంటీన్ కలెక్షన్లే ఎక్కువ?

ఇక కల్కి సినిమా థియేటర్లలో వెయ్యి కోట్ల మార్క్ ని దాటేయగా పదకొండు వందల కోట్ల మార్క్ ని దాటి పలు లిమిటెడ్ స్క్రీన్స్ లో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇదిలా ఉండగా తాజాగా నెట్టింట కల్కి గురించి ఓ క్రేజీ వార్త వచ్చింది. కల్కి థియేటర్స్ లో సినిమా టికెట్స్ కంటే క్యాంటీన్ లో సమోసాలు, కూల్ డ్రింక్స్ ల కలెక్షన్లే ఎక్కువ వచ్చాయని టాక్ నడుస్తుంది. అది కూడా కొన్ని థియేటర్లలో ఏకంగా క్యాంటీన్ కలెక్షన్లే, థియేటర్ కి కోటి రూపాయలు వచ్చిందట. నమ్మ శక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అని సోషల్ మీడియా వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ గ్రూప్ థియేటర్లకు క్యాంటీన్ కలెక్షన్ల వల్లే 50 కోట్ల వరకు వచ్చిందని, పీవీఆర్ వాళ్ళకి అంతకంటే ఎక్కువే వంద కోట్ల వచ్చిందని సమాచారం. వారికి సినిమా ద్వారా 30 శాతం లాభం వస్తే, క్యాంటీన్ కలెక్షన్ల వల్లే ఎక్కువ శాతం లాభం వచ్చిందని సమాచారం.

- Advertisement -

లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు…

ఇక కల్కి సినిమా థియేటర్లలో ఇప్పటికే 1100 కోట్ల మార్క్ ని దాటగా, లాంగ్ రన్ లో లిమిటెడ్ స్క్రీన్స్ లో రన్ అవుతూనే ఉంది. మల్టిప్లెక్స్ లో ఇప్పటికీ రన్ అవుతుండగా, కల్కి థియేటర్లలో రిలీజ్ అయిన పది వారాల తర్వాత ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. ఇక కల్కి సినిమా సీక్వెల్ మాత్రం 2025 లో ప్రారంభమై 2026 లో థియేటర్లలో వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్, నెక్స్ట్ హను రాఘవపూడి సినిమా స్టార్ట్ చేయనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు