Indian 2 : కమల్ సినిమా సెట్ ?

టాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ భాషల్లోనూ హిట్ అయింది. విక్రమ్ చివరికి రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది. ఈ సినిమా హిట్ తర్వాత కమల్ హాసన్ భారతీయుడు 2పై దృష్టి పెట్టాడు. ఎలాగైనా భారతీయుడు 2 సినిమాను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. దాని కోసం డైరెక్టర్ శంకర్ తో చర్చలు కూడా జరిపాడు.

చివరిగా, భారతీయుడు 2 సినిమా సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతుందట. కోలీవుడ్ సర్కిల్స్ లో వస్తున్న వార్తల ప్రకారం, భారతీయుడు 2 షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే ఆ సమయం వరకు రామ్ చరణ్ RC15 షూటింగ్ పూర్తి కాదు. దీంతో డైరెక్టర్ శంకర్ ఒక పది రోజులను భారతీయుడు 2 కోసం, మరో పది రోజులను RC15 కోసం ఉపయోగిస్తాడట.

అయితే, శంకర్ ఇలా చేయడం వల్ల రామ్ చరణ్ కు నష్టం జరుగుతుందా లేదా కమల్ హాసన్ కు నష్టం జరుగుతుందా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రామ్ చరణ్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజులు RC15కు శంకర్ టైమ్ కేటాయిస్తే, షూటింగ్ పూర్తి అవుతుంది. ఇలాంటి సమయంలో కమల్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడంపై శంకర్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. శంకర్ వల్ల తమ అభిమాన హీరో సినిమా మరింత సమయం పట్టేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు