Kangana Ranaut: పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్..!

Kangana Ranaut: బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన హీరోయిన్ కంగనా రనౌత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈమె సినిమాలలో కంటే ఎక్కువగా వివాదాలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా నిత్యం ఏదో ఒక వార్తలలో సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతూ ఉంటుంది.. అయితే ఈసారి మాత్రం కంగనా రనౌత్ సంబంధించిన ఒక వార్త అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

కంగనా రనౌత్.. తన వ్యక్తిగత జీవితం కారణంగా మరొకసారి వార్తలలో నిలుస్తోంది.. తాజాగా కంగనా రనౌత్ ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఎవరిని వివాహం చేసుకుంది అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. కంగనా రనౌత్ ఒక గుర్తుతెలియని వ్యక్తితో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఆ యువకుడు చేతిలో చేయి పట్టుకొని మరి సెలూన్ నుంచి బయటకు వెళ్తున్న ఫోటో ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది.

కంగనా రనౌత్ చెయ్యి పట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇద్దరు కలిసి వెళ్లారు? అనే ప్రశ్నలు కూడా అభిమానులలో తలెత్తున్నాయి.. ఎవరికి చెప్పకుండా ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకుందా అనే విధంగా చర్చలు కూడా మొదలయ్యాయి.. అయితే కంగనా చేయి పట్టుకున్న ఆ మిస్టర్ మెన్ మాత్రం చూడడానికి చాలా అందంగానే కనిపిస్తున్నారు. ఈ జోడి కూడా బాగుందని పలువురు అభిమానులు నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.కంగనా రనౌత్ పెళ్లి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీరి ఫోటోలు వైరల్ గా అవుతున్నాయి.

- Advertisement -

Kangana Ranaut: Bollywood queen ready for marriage..!

కంగనా రనౌత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది నవంబర్ నెలలోనే విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. కొన్ని కారణాల చేత ఆలస్యమైంది. దీంతో ఈ ఏడాది ఈ సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసం దాదాపుగా కంగనా రనౌత్ తన ఆస్తిలో కొంత భాగాన్ని సైతం అమ్మినట్లు గతంలో వార్తలు వినిపించాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు