Kanguva: కంగువలో రోలెక్స్… సూర్య ఫ్యాన్స్ కు థియేటర్స్ లో పూనకాలే

Kanguva: ‘కంగువ’ టీమ్ రెగ్యులర్ అప్‌డేట్స్‌తో సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేస్తోంది. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ రెండు టీజర్‌లు రిలీజ్ చేయగా, అవి రెండు కూడా భారీ బజ్‌ని సృష్టించాయి. ఇక ఈ నేపథ్యంలోనే ‘కంగువ’ మూవీలో రోలెక్స్ కూడా కనిపించబోతున్నాడు అనే క్రేజీ వార్తా తాజాగా తెరపైకి వచ్చింది.

కంగువలో రోలెక్స్

‘కంగువ’లో ‘రోలెక్స్’ క్యారెక్టర్ ప్రత్యేకంగా కనిపించబోతోందని చెన్నై సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. రోలెక్స్ అనేది లోకేశ్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సృష్టించిన క్రూరమైన విలన్ పాత్ర అనే విషయం మనకు తెలుసు. ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్ లో సూర్య రోలెక్స్ గా కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు. సూర్య పాత్ర కారణంగానే విక్రమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెప్పాలి. రోలెక్స్ పాత్రలో సూర్య జీవించిన తీరు అందరినీ కట్టి పడేసింది. విలన్ క్యారెక్టర్ అయినప్పటికీ సూపర్ కిక్ ఇచ్చింది. అయితే రోలెక్స్ క్యారెక్టర్ కు సంబంధించి సెపరేట్ గా మూవీ ఉంటుందని, లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఆ మూవీ తెరపైకి రాబోతోందని విక్రమ్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రేక్షకులు విక్రమ్ పార్ట్ 2 కోసం ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే దానికి ముఖ్య కారణం రోలెక్సే. ఇప్పుడు ఇదే క్యారెక్టర్ కంగువ మూవీలో కూడా కన్పించబోతోందని అంటున్నారు.

Suriya's character Rolex from Vikram to get a spin-off; Kamal Haasan, Lokesh Kanagaraj drop exciting updates | PINKVILLA

- Advertisement -

ట్రైలర్ లోనే సర్ప్రైజ్

‘కంగువ’ కథ రెండు టైమ్‌ లైన్‌లలో జరగడంతో, ప్రెజెంట్ టైమ్ లైన్ లో ఒకటి లేదా రెండు సన్నివేశాలలో రోలెక్స్‌ను చూపించబోతున్నారనే రూమర్ సూర్య ఫ్యాన్స్ కు ఎక్కడలేని జోష్ ను తెప్పిస్తోంది. వచ్చే నెలలో విడుదల కానున్న ‘కంగువ’ ట్రైలర్‌లో ఈ బిట్ జోడించనున్నట్లు తెలుస్తోంది. సూర్యను మరోసారి రోలెక్స్‌గా వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

1000 కోట్ల ఆశలు

అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. బాబీ డియోల్ నెగిటివ్‌గా నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో దిశా పటాని కథానాయిక. మహత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి మధన్ కార్కీ డైలాగ్ రైటర్ కాగా, శివ, ఆది నారాయణ కలిసి స్క్రిప్ట్ రాశారు. వెట్రి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా, మిలన్ ఆర్ట్ డైరెక్టర్ గా, రిచర్ కెవిన్ ఎడిటర్‌గా, సుప్రీం సుందర్ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటిదాకా కోలీవుడ్‌ కు అందని ద్రాక్షగా మిగిలిపోయిన వెయ్యి కోట్ల కల ఈ సినిమా తీర్చేస్తుందని తమిళ తంబీలు ఆశిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు