Kanguva Update : రెండు లుక్స్ మాత్రమే కాదు… సూర్య అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్

Kanguva Update : మోస్ట్ అవైటెడ్ తమిళ మూవీ కంగువ గురించి సూర్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటిదాకా కంగువ మూవీలో సూర్య రెండు విభిన్నమైన లుక్స్ లఓ దర్శనం ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏమిటంటే ఆయన కేవలం రెండు లుక్స్ లఓ కాదు అంతకంటే ఎక్కువ డిఫరెంట్ లుక్స్ లో తెరపై దర్శనం ఇవ్వబోతున్నాడు అన్న అదిరిపోయే వార్త తాజాగా లీక్ అయ్యింది.

రెండు లుక్స్ లో కాదు

శివ దర్శకత్వం వహించిన కంగువ అనే పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రం ఎట్టకేలకు త్వరలో సిల్వర్ స్క్రీన్‌లపైకి రానుండడంతో ప్రొడక్షన్‌కి సంబంధించిన వర్గాల నుంచి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అంటే పోస్టర్స్ లో చూపించినట్టుగా కేవలం రెండు లుక్స్ లో కాదు మరో లుక్ లో కూడా కన్పించి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు సూర్య. అంటే మొత్తం 3 రకాల లుక్స్ లఓ సూర్య పాత్రను మేకర్స్ డిజైన్ చేశారని సమాచారం. అంతేకాకుండా ఈ విభిన్న పాత్రల కోసం సూర్య కఠినమైన ట్రాన్స్ఫార్మేషన్ కు మారాడని తెలుస్తోంది. ఇందులో ఒక్కో పాత్రకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఇదివరకు సూర్య ఎన్నో సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు. కానీ త్రిపాత్రాభినయం చేయడం మాత్రం ఇదే తొలిసారి.

Kanguva (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

- Advertisement -

అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కోసం మేకర్స్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతిక నిపుణులను చిత్రబృందంలో చేర్చుకున్నారు. ఈ చిత్రంతోనే హిందీ నటుడు బాబీ డియోల్, దిశా పటానీలు తమిళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో 10,000 మందితో కూడిన భారీ వార్ సీక్వెన్స్‌ కూడా ఉంది. శివ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం 3D ఫార్మాట్‌లలో కూడా విడుదల చేయనుండగా, రాక స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.

కోలీవుడ్ ఆశలన్నీ ఆయనపైనే

ఈ ఏడాది తమిళంలో ఒక్క సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లఓ చేరలేదు. ఇటీవల రిలీజ్ అయిన ఇండియన్ 2 రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ రాబడుతుందేమో అనుకుంటే బొక్క బోర్లా పడింది. మరి కంగువా అయినా ఆ కలను నెరవేరుస్తుందా? లేదంటే అంతకంటే ముందే ఇంకేదైనా మూవీ ఈ ఘనతను సాధిస్తుందా ? అనేది చూడాలి.

నెక్స్ట్ మూవీని కూడా లైన్లో పెట్టిన సూర్య

తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సర్ఫిరాలో అతిధి పాత్రలో కనిపించిన సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో జయరామ్, జోజు జార్జ్, కరుణాకరన్ కీలక పాత్రలు పోషిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా కన్పించబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు