Kannappa: కన్నప్పకు కష్టాలు రావొద్దని… మరో స్టార్ హీరో ఎంట్రీ

Kannappa: ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాస్ లో కన్నప్ప సినిమా ఒకటి. వాస్తవానికి ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఈ సినిమాను మంచు ఫ్యామిలీ నిర్మిస్తుండటం ఈ సినిమాలో మంచు విష్ణు నటిస్తుండడం కారణాలు. అయితే ఇవి చాలామందికి ఇవి పెద్ద కారణాల అని అనిపించొచ్చు. రీసెంట్ టైమ్స్ లో ఈ ఫ్యామిలీ చేస్తున్న ఏ సినిమా కూడా సరైన ఆదరణ లభించలేదు. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకి కేవలం ఒక థియేటర్లో రెండంటే రెండు టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన జిన్నా సినిమా ఒక మాదిరిగా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు వీళ్ళు హై బడ్జెట్ తో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చాలామంది నటులతో

ఇకపోతే మంచు విష్ణు మార్కెట్ తెలిసిందే కాబట్టి ఇంత భారీ బడ్జెట్ తన మీద పడితే వర్కౌట్ అవ్వదు అని తెలిసి మిగతా ఇండస్ట్రీలోని ప్రముఖులను కూడా ఈ సినిమాలు ఇంక్లూడ్ చేయటం మొదలుపెట్టారు. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సాధించిన ప్రభాస్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. చాలామంది బాలీవుడ్ నటులతో పాటు బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి మంచు విష్ణు కంటే కూడా మిగతా నటన చూడటానికి ఎక్కువ మంది వెళ్తారు అని చెప్పొచ్చు. ఇకపోతే తాజాగా తమిళ్ హీరో శింబు కూడా ఈ సినిమాలో భాగమవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Simbu

- Advertisement -

వల్లభ సినిమాతో మంచి ఆదరణ

శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. తెలుగు ప్రేక్షకులు కూడా శింబు సినిమాలను ఎగబడి చూశారు. వల్లభ, మన్మధ వంటి ఎన్నో సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఇక మధ్యకాలంలో శింబు సినిమాలు చేయటం తగ్గించాడు. రీసెంట్ గా సోనీ లైవ్ లో వచ్చిన “మానాడు” సినిమాకి మంచి ఆదరణ లభించింది. వెంకట ప్రభు ఈ సినిమాను తీసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం శింబు తన కెరియర్ లో 48వ సినిమాను చేస్తున్నాడు ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు కన్నప్ప సినిమాలో కనిపిస్తాడని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు