Karthi : జక్కన్న చిత్రంలో ?

త‌మిళ అగ్ర హీరోల్లో ఒక‌రైన‌టువంటి కార్తి వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు. ఇటీవ‌ల మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా సూప‌ర్ హిట్ సాధించి రికార్డునే సృష్టించింది. పొన్నియిన్ సెల్వ‌న్ 2 కూడా మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్నారు. అది అలా ఉండ‌గానే కార్తి స‌ర్దార్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

స‌ర్దార్ సినిమా దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది. ఈ చిత్రాన్ని పీఎస్ మిత్ర‌న్ తెర‌కెక్కించారు. ఇందులో కార్తీ రెండు పాత్ర‌ల్లో న‌టించాడు. ఒక‌టి పోలీస్ ఆఫీస‌ర్ కాగా.. మ‌రొక‌టి స‌ర్దార్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు ఈ సినిమాలో కార్తి ఏకంగా 15 గెట‌ప్‌ల‌లో క‌నిపించాడ‌ట‌. అది పాట‌లో అని కొంద‌రూ అంటుంటే.. మ‌రికొంద‌రూ మారువేశంలో అని పేర్కొన‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి- టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమాలో కూడా కార్తీ ఓ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. రాజ‌మౌళి ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కించి ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌న్న‌న‌లు పొందిన విష‌యం తెలిసిందే. మ‌హేష్‌తో చేసే సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీని ఇటీవ‌లే రాజ‌మౌళి సంప్ర‌దించార‌ట‌. అందుకు కార్తీ కూడా ఓకే చెప్పాడ‌ట‌. ఈ విష‌యంపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు