Tharun Bhascker: ‘కీడా కోలా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఓవర్ ప్రమోషన్ దెబ్బేసిందా?

టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో “కీడా కోలా” ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే రిలీజ్ అయిన ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రావడం వల్ల సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం గ్యారెంటీ అని చాలా మంది అనుకున్నారు.

అయితే వీకెండ్ తర్వాత డల్ అయిపోయిన కీడా కోలా ఫస్ట్ వీక్ అయ్యే సరికి థియేటర్లు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. తాజాగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ డీటెయిల్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కీడా కోలా 3.83 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ తో కలిపి 6.85 కోట్ల షేర్ ని సాధించింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కాగా, కీడా కోలా టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంకా 2.15 కోట్లు కావాలి.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కుదరదని అనిపిస్తుంది. పైగా ఈ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల పోటీని కూడా తట్టుకోలేదు.

- Advertisement -

అయితే కీడా కోలా కి దెబ్బ పడింది అంటే.. రెండు విషయాల్లో అని చెప్పొచ్చు. కీడా కోలా పై కంటెంట్ కంటే, ప్రమోషన్ మీదే తరుణ్ భాస్కర్ ఎక్కువ దృష్టి పెట్టాడు, సినిమా కి చిన్నా చితకా యూట్యూబ్ ఛానెల్స్ కూడా వదలకుండా ఓవర్ ప్రమోట్ చేయడం వల్ల అది మొదటికే మోసం వచ్చిందని చెప్పొచ్చు.

ఇక రెండో రీసన్ ఏంటంటే కీడా కోలా కి పోటీ గా పొలిమేర2 రావడం, ఆ సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అవడం వల్ల ఆడియన్స్ ఆ సినిమాకే ఎక్కువ క్యూ కట్టేసారు. లేకపోతే కీడా కోలా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యేది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు