Kiara Advani: గేమ్ ఛేంజర్ టు కెరీర్ ఛేంజింగ్… మరో రెండు సినిమాలకు సైన్ చేసిన కియారా 

ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కియారా ఒకరు. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బాలీవుడ్ భామ ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను మెయింటైన్ చేస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో బిజీబిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ చరణ్ తో “గేమ్ ఛేంజర్” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టేసింది కియారా.

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ “గేమ్ ఛేంజర్”. రామ్ చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ 10 రోజుల కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేయనున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రకటించి ఇప్పటికీ చాలాకాలం అయిపోతోంది. కానీ షూటింగ్ మాత్రం ఇప్పటిదాకా నత్త నడకన సాగింది. ఇక ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో హీరో హీరోయిన్లు ఇతర సినిమాల జోలికి వెళ్లకుండా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఇప్పట్లో కంప్లీట్ అయ్యేలా కనిపించడం లేదనుకుందో ఏమోగానీ కియారా మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైఆర్ఎఫ్ స్పై సిరీస్ లో భాగమైన “వార్ 2” మూవీలో కియారా సైన్ చేసింది. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. వచ్చే వారం హృతిక్ సెట్స్ లో జాయిన్ అవుతారు. ఎన్టీఆర్ ఏప్రిల్ లో ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీతో పాటు తాజాగా కియారా ఖాతాలో మరో భారీ పాన్ ఇండియా మూవీ చేరింది. భారీ బడ్జెట్ హిందీ యాక్షన్ ఎంటర్టైనర్ “డాన్ 3″లో కియారా హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. మొదటి రెండు భాగాల్లో షారుక్ హీరోగా నటించాడు. అయితే మూడవ భాగంలో కూడా మేకర్స్ ఆయననే అనుకున్నప్పటికీ, షారుక్ తిరస్కరించడంతో ఆ అవకాశం రణవీర్ సింగ్ కు దక్కింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో “డాన్ 3” షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ మూవీలో రణవీర్ సింగ్ సరసన కియారా నటించనుంది అన్న విషయాన్ని సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందే మేకర్స్ ప్రకటించడం విశేషం. ఈ మూడు సినిమాలు గనక హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా కియరా హవా స్టార్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు