Kishor: ధనుష్ తో సినిమా అని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు రాఘవ లారెన్స్ తో.?

Kishor: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మొదటి షార్ట్ ఫిలిమ్ శాతం కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత దర్శకులుగా తమకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని నేడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఎంతోమంది తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ముందు షార్ట్ ఫిలింతో తమ జర్నీని స్టార్ట్ చేసి సూపర్ స్టార్ రజినీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నేడు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి.

ఇకపోతే అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది దర్శకులు మొదటి షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెరియర్ స్టార్ట్ చేసి నేడు ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. పెళ్లిచూపులు సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తరుణ్ భాస్కర్ మొదటి సైనామా అని షార్ట్ ఫిలిం చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తరుణ్ భాస్కర్ నుంచి ఒక సినిమా ఎంతో క్యూరియాసిటీతో చాలామంది వెయిట్ చేస్తున్నారని అనడంలో ఆశ్చర్యం లేదు.

ఒక శర్వానంద్ ప్రియాంక అరుణ్ మోహన్ జంటగా నటించిన సినిమా శ్రీకారం. ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు కిషోర్ బి. మొదట ఇదే సినిమాను షార్ట్ ఫిలిం గా తెరకెక్కించాడు. ఈ కథను బాగా నచ్చి 14 రీల్స్ సంస్థ దీని సినిమాగా తీయాలని శర్వానంద్ హీరోగా పెట్టి తీశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేదు. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్యత ఇవన్నీ కూడా చాలా మంది ఆడియన్స్ కి బాగా నచ్చాయి. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక సినిమాను కూడా చేయలేదు దర్శకుడు కిషోర్.

- Advertisement -

 Dhanush

ఇక దిల్ రాజు నిర్మాతగా కిషోర్ దర్శకుడుగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో ఒక సినిమా రాబోతుంది అంటూ ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. కానీ దాని గురించి ఇప్పటివరకు ఒక అధికారక ప్రకటన కూడా రాలేదు. ఇక రీసెంట్ గా మరో వార్త వినిపిస్తుంది. కిషోర్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ తెలుగులో హీరోగా డైరెక్ట్ సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్లీ కిషోర్ దర్శకత్వంలో రాఘవ కనిపించబోతున్నాడు. అయితే ధనుష్ చేయవలసిన సినిమాను లారెన్స్ చేస్తున్నాడా, లేదంటే ధనుష్ కి ఉన్న బిజీ షెడ్యూల్ వలన మరో కథను రాఘవ లారెన్స్ తో కిషోర్ తీస్తున్నాడా అనేది త్వరలో తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు