Koratala : దేవర వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు… కానీ పార్ట్ 2లో మాత్రం భారీ విలన్

Koratala Siva (devara updates ) : ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాస్ లో దేవర ఒకటి. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివకు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. వరుసగా నాలుగు హిట్ సినిమాలు చేసిన తర్వాత ఆచార్య సినిమాతో డిజాస్టర్ చవి చూశాడు కొరటాల. అప్పటివరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాలను అక్కడి నుంచి చాలామంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఆచార్య సినిమా ఊహించని డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.

ఆచార్య సినిమాకు సంబంధించి కొరటాలకు పేరు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా నష్టం జరిగింది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొరటాల వర్క్ చేశాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో షేర్స్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలి మినిమం కలెక్షన్స్ కూడా రాకుండా అయిపోయింది. కొన్నిచోట్ల స్వయంగా కొరటాల డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. కొరటాల సినిమా విషయానికి వస్తే కమర్షియల్ గా సినిమాను తెరకెక్కించడమే కాకుండా కొన్ని సామాజిక అంశాలను కూడా సినిమాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు.

దాదాపు రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పటికీ పూర్తిగా లేదు. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన అవ్వకపోవడం వలన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. మరో రెండు నెలల్లో ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్ప్స్ తప్ప ఇంకేది రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన ఆ వీడియో కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

 Bobby Deol

రీసెంట్ టైమ్స్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా పార్ట్ 2 అవకాశం ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇక దేవర సినిమా కూడా పార్ట్ టూ ను అనౌన్స్ చేశారు. అయితే ఈ పార్ట్ 2 లో బాబి బాబీ డియల్ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమాలో బాబీ డియల్ తన విశ్వరూపం చూపించాడు. ఇక ఈ సినిమాలో కూడా బాబీ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు