Krishna: ఏంటీ.. సూపర్ స్టార్ కూతుర్ని.. ఆ స్టార్ హీరో దత్తత తీసుకోవాలనుకున్నారా.?

Krishna.. టాలీవుడ్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరోలలో దివంగత నటులైన సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఒకరు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉండే స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటిసారి కృష్ణ 1960లో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాగా.. 1966లో కృష్ణంరాజు సినీ ఇండస్ట్రీలోకి మొదలుపెట్టారు. వీరిద్దరూ కలసి.. పలు రకాల మల్టీ స్టారర్ చిత్రాలలో కూడా నటించడం జరిగింది. గతంలో ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న కృష్ణంరాజు.. తమ బంధాన్ని సైతం తెలియజేయడం జరిగింది.. ఇకపోతే కృష్ణంరాజు, కృష్ణ ఇద్దరూ మనమధ్య లేకపోయినా..అప్పట్లో వారి సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. వాటి గురించి చూద్దాం.

Krishna: Aunty.. the daughter of a superstar.. did that star hero want to adopt?
Krishna: Aunty.. the daughter of a superstar.. did that star hero want to adopt?

కృష్ణతో అనుబంధం పై కృష్ణంరాజు క్లారిటీ..

నటుడు కృష్ణంరాజు కృష్ణ కుటుంబంతో ఉన్న తన స్నేహ బంధాన్ని ఈ విధంగా రివీల్ చేశారు.. కృష్ణ తనకు మంచి మిత్రుడు మాత్రమే కాదు.. తన మంచి మనసు.. పౌరుషం ఉన్న వ్యక్తి అంటూ తెలియజేశారు.. నిజానికి తాను రెబల్ స్టార్ కాదు రెబల్ ప్రొడ్యూసర్ అంటూ తనంతటకు తానే ఈ విషయాన్ని తెలియజేశారు కృష్ణంరాజు. ముఖ్యంగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చింది అంటూ తెలిపారు కృష్ణంరాజు. అంతేకాకుండా కృష్ణ చేసినన్ని సాహసాలు అందుకున్నటువంటి ఘనతలు ఎవరు కూడా అందుకోలేదని వెల్లడించారు.

కృష్ణ కూతుర్ని దత్తత తీసుకోవాలనుకున్న కృష్ణంరాజు..

అయితే సూపర్ స్టార్ కృష్ణ కి కృష్ణంరాజుకి మధ్య ఉన్న అనుబంధంతో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారట కృష్ణంరాజు.. అదేమిటంటే కృష్ణ చివరి కుమార్తెను తాను దత్తత తీసుకోవాలని అనుకున్న కృష్ణంరాజు.. వెంటనే కృష్ణ ను అడిగితే.. కృష్ణ కూడా ఆ విషయానికి ఒప్పుకున్నారని కృష్ణంరాజు నవ్వుతూ వెల్లడించారు.. అంతేకాకుండా మహేష్ బాబు నటించిన బాబీ చిత్రాన్ని కూడా తానే చేస్తానని చెప్పానని.. అందుకు కూడా కృష్ణ ఓకే చెప్పారని తెలిపారు కృష్ణంరాజు.. కృష్ణ విజయం వెనుక ఉన్న ఏకైక మహిళ విజయనిర్మల.. నాకు నా భార్య శ్యామల అని తెలిపారు కృష్ణంరాజు.

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ కార్మికుల కోసం ఎంతో చేశారు..

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ఏడాదికి 14 సినిమాలను సైతం విడుదల చేసేవారు.. కొన్ని కొన్ని సార్లు కృష్ణని చూసినప్పుడల్లా ఇన్నేసి సినిమాలు ఎలా చేస్తున్నారు అంటూ ఆశ్చర్యపోయే వాడిని అంటూ తెలిపారు.. అయితే ఈ విషయం పైన ఒకసారి సూపర్ స్టార్ కృష్ణని అడగగా.. సినీ ఇండస్ట్రీ మీద బతికేటువంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి.. మన అలసట వల్ల అలాంటి కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతుంది అందుకే అలసట వచ్చినా కూడా వాటిని దిగమింగుకొని మరి నటిస్తూ ఉంటానని చెప్పడంతో కృష్ణంరాజు ఒక్కసారిగా షాక్ అయ్యాను అని తెలిపారు. అయితే తన సినీ కెరియర్లో ఏడాదికి నాలుగు లేదా ఐదు సినిమాలను మాత్రమే చేశానని. కృష్ణ వంటి హీరో లాగా ఎప్పుడు చేయలేకపోయానని కృష్ణంరాజు వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు