Kriti Shetty: ఆ తెలుగు హీరో అంటేనే భయపడిపోతున్న బేబమ్మ.. కారణం..?

Kriti Shetty.. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కృతి శెట్టి.. తన మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నది. ఇక ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోయింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసి అక్కడ అడపా దడపా సినిమాలలో నటిస్తోంది కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి..

Kriti Shetty: Bebamma is afraid of that Telugu hero.. the reason..?
Kriti Shetty: Bebamma is afraid of that Telugu hero.. the reason..?

ఫ్లాప్ దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించేసిన బేబమ్మ..

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి టాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది అదేమిటంటే.. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే ఈ ముద్దుగుమ్మ రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న అభిమానులు సైతం కాస్త ఖంగు తిన్నప్పటికీ.. కృతి శెట్టి.. సినిమాని రిజెక్ట్ చేయడానికి ముఖ్య కారణం వరుసగా ఫ్లాప్స్ ఎదురవ్వడమే అన్నట్లుగా తెలుస్తోంది.. ఈ యమ్మడు ఈ మధ్యకాలంలో ఎలాంటి చిత్రాలలో నటించినా కూడా అది భారీ డిజాస్టర్ గానే మిగిలిపోతోంది. గతంలో రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీ డిమాండ్ చేసిన కృతి శెట్టి.. ఇప్పుడు రెమ్యూనరేషన్ ను కూడా మరింత తగ్గించుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు సినిమానే రిజెక్ట్ చేసిన బేబమ్మ..

వరుస ఫ్లాప్ లు ఎదురు అవుతున్న సమయంలో ఇకమీదట తెలుగులో సినిమాలలో నటించకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకుందట. అందుకే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో తనకు అవకాశం వచ్చినా వదులుకున్నట్లు సమాచారం. ఈ పాత్రని మీనాక్షి చౌదరి సంపాదించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్రకి సినిమాలో పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ కూడా స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని మాత్రం కృత్తి శెట్టి వదిలేసుకుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చివరిగా శర్వానంద్ తో కలిసి నటించిన మనమే సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

- Advertisement -

తెలుగులో అవకాశాలు రావడం కష్టమేనా..

దీన్ని బట్టి చూస్తే కృతి శెట్టి రాబోయే రోజుల్లో తెలుగులో నటించడం చాలా కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ వైపే వెళుతున్నట్లు తెలుస్తోంది. మరి కోలీవుడ్లో అయినా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు అందుకొని.. సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదిస్తుందేమో చూడాలి. మరి కృతి శెట్టి తలరాతను మార్చే సినిమా ఏదో చూడాలి. ఇదిలా ఉండగా కోలీవుడ్ లో ఈమెకు ప్రముఖ స్టార్ హీరోలైన విశాల్ సూర్య వంటి హీరోల సరసన నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏది వెలబడలేదు త్వరలోనే అన్ని విషయాలు తేలనున్నట్లు సమాచారం మరి ఆ సినిమాలు నిజమైతే ఆమెకు అవకాశాలు ఏ విధంగా లభిస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు