Tollywood: ఆ విషయంలో శ్రీలీలను ఫాలో అవుతున్న కృతిశెట్టి..!

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కొక్కరి హవా నడుస్తుంది. కొంతకాలం క్రితం కృతి శెట్టి హవా కొనసాగింది. ప్రస్తుతం శ్రీలీల హవా కొనసాగుతోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి ఇక అసలు తిరుగు ఉండదని అంతా భావించారు. ఆ సినిమా తర్వాత కొన్ని అవకాశాలు వరుసగా వచ్చినా కూడా ఇప్పుడు టాలీవుడ్ లో కృతి శెట్టి పేరు అందరూ మరిచిపోయే పరిస్థితి ఉందని చెప్పాలి. మరోవైపు పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మాత్రం ఇప్పుడు చేతినిండా సినిమాలతో టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కీ వెళ్ళిపోయింది.

ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీలీల ఓ అదృష్ట దేవతగా మారిపోయింది. తనతో సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అన్న నమ్మకం దర్శక నిర్మాతలలో పడిపోయింది. అయితే ఇప్పుడు ఓ విషయంలో శ్రీలీలని ఫాలో అవుతుందట కృతి శెట్టి. ఆమె తీసుకున్న నిర్ణయం చూస్తుంటే అది అచ్చుగుద్దినట్లు అలానే ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. శ్రీలీల హిట్ ట్రాక్ ని ఫాలో అవ్వడానికి శ్రీలీల ఎ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటుందో కృతి శెట్టి కూడా అలాగే ఎంచుకుంటుందన్న వార్త వైరల్ అవుతుంది.

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకు కూతురుగా నటించిన శ్రీలీల ఎలా పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుందో చూసాం. ఇప్పుడు కృతి శెట్టి కూడా ఓ స్టార్ హీరోకి కూతురుగా నటించడానికి అంగీకరించిందట. కమల్ హాసన్ – నయనతార జోడీగా మణిరత్నం ఓ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ కి కూతురి పాత్రలో కృతి శెట్టి నటించబోతుందట. ఈ చిత్రంలో ఈమె పాత్ర చిన్నదే అయినప్పటికీ స్టార్లు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో క్రేజ్ లభిస్తుందని ఈ నిర్ణయం తీసుకుందట.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు