Kushi : ఎదురుచూపులు

ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా మంది దాని కోసం పని చేయాలి. తెర మీద కనిపించే నటీనటులు, తెర వెనకుల కష్టపడే టెక్నికల్ టీంతో పాటు క్రూ అంతా కలిసి సమిష్టిగా పని చేస్తేనే సినిమా పూర్తి అవుతుంది. విజయాన్ని అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా సపొర్ట్ చేయకపోయినా.. సినిమా ముందుకు కదలదు. ముఖ్యంగా షూటింగ్ సమయాల్లో హీరో, హీరోయిన్లు తప్పకుండా అందుబాటులో ఉండాలి. ఇందులో ఏ ఒక్కరు అయినా అందుబాటులో లేకుంటే.. వాయిదా పడటం గ్యారంటీ.

ప్రస్తుతం ఇలాంటి సమస్యలనే ఖుషి టీం ఎదుర్కొంటుందని తెలుస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2022 ఏప్రిల్ లో అధికారికంగా ప్రారంభమైంది. షూటింగ్ ను కూడా కొంత వరకు జరుపుకుంది. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత తాజాగా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించడానికి మూవీ టీం సన్నద్ధం అవుతుందని సమాచారం.

నవంబర్ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని డైరెక్టర్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త షెడ్యూల్ కు హీరోయిన్ సమంత ఇప్పటి వరకు డేట్స్ ఇవ్వలేదట. కనీసం మూవీ టీంతో కాంటాక్ట్ లోకి కూడా రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీంతో నవంబర్ తొలి వారంలో షూటింగ్ జరుగుతుందా లేదా అనేది టీం క్లారిటీగా చెప్పకలేకపోతున్నారు.

- Advertisement -

అయితే సామ్ గత కొద్ది రోజుల నుంచి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే సామ్.. కొంత కాలం మొత్తానికే కనిపించలేదు. ఇటీవల రెండు పోస్టులు మాత్రమే కనిపించాయి. ఇదిలా ఉండగా, సమంత.. పర్సనల్ ఒత్తిడిని జయించడానికి ఈషా ఫౌండేషన్ కు వెళ్లిందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు