Lokesh Kanagaraj : లోకి మరో వరల్డ్ క్రియేట్ చేస్తున్నాడా? కూలీ ఎన్ని పార్ట్‌ల్లో రాబోతుంది?

Lokesh Kanagaraj : ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం అందరి దృష్టి ఆయన దర్శకత్వంలో రూపొందుతున్నకూలీ మూవీపైనే ఉంది. అందులో నుంచి ఆయన రివీల్ చేస్తున్న క్యాస్టింగ్ సినిమాపై ఓ రేంజ్ లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. అయితే తాజాగా కూలీ సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఆయన విడుదల చేసిన కొత్త పోస్టర్ కూలీ ఎన్ని పార్ట్స్ గా రాబోతోంది ? అనే ఓ కొత్త డౌట్ ను పుట్టిస్తోంది. మరి ఆ పోస్టర్ సంగతులు ఎంటో చూసేద్దాం పదండి.

ప్రీతి లుక్ అవుట్

ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ‘కూలీ’ ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది రజనీకాంత్ 171వ చిత్రం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని కాస్టింగ్‌తో పాటు టెక్నికల్ క్వాలిటీతో కూడా వీలైనంత భారీగా తెరకెక్కించాలని చూస్తున్నాడు లోకేష్. సినిమాలో భాగంగా సౌబిన్ సాహిర్‌ పాత్రను చిత్రబృందం రీసెంట్ గా ప్రకటించింది. ఈ చిత్రంలో షౌబిన్ దయాళ్ అనే పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన ‘సైమన్’ అనే కీలక పాత్రలో నటించబోతున్నాడని మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నాగార్జున లాంటి స్టార్ హీరో ఇందులో ఉండటంతో కూలీ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించడం ఖాయం. ఈ నేపథ్యంలోనే నటీనటుల గురించి రోజుకో అప్డేట్ వెలువడుతుండగా, మేకర్స్ ఈ చిత్రం నుండి శృతి హాసన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇంట్రడ్యూసింగ్ ప్రీతి ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ కూలీ అంటూ శృతి హాసన్ కు అధికారికంగా కూలీ టీం వెల్కమ్ చెప్పింది. అయితే ఆమె పోస్టర్ తో పాటు మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూలీ సినిమా ఎన్ని పార్ట్ లుగా రాబోతోంది అనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది.

Image

- Advertisement -

లోకి యూనివర్స్ లోకి నో ఎంట్రీ

‘కూలీ’ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)లో భాగమని అభిమానులు మూవీని లోకి అనౌన్స్ చేసినప్పటి నుంచే అనుకుంటన్నారు. లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ ద్వారా ఒక సినిమాకు ఇంకో సినిమాను లింక్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్తూ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అయితే దర్శకుడు లోకేష్ కొంతకాలం క్రితమే మీడియా, అభిమానులతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది ఒక స్టాండ్-అలోన్ చిత్రమని వెల్లడించారు. అయితే కూలీ లోకి యూనివర్స్ లో భాగం కాకపోయినా సీక్వెల్స్ తెరకెక్కే అవకాశం ఉందా? లేదా? అనేది ఇప్పుడు అభిమానుల మనసులో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం లోకి నుంచి వచ్చేదాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు