Lucky Bhaskar : అన్ ‘లక్కీ భాస్కర్’… ఎన్నిసార్లు వాయిదా వేస్తారు మాస్టారు.?

Lucky Bhaskar : ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా సినిమాలను ఎంకరేజ్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అందుకే చాలామంది తమిళ నటు సినిమాలు కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ గా ప్రూవ్ అవుతుంటాయి. చాలామంది తమిళ్ హీరోస్ కి అక్కడ దక్కని ఆదరణ కూడా ఇక్కడ దక్కుతుంది అని చెప్పొచ్చు. తమిళ యంగ్ హీరోస్ అయిన సిద్ధార్థ (Siddarth), కార్తీ(Karthi) వంటి హీరోస్ కి తెలుగులో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. అప్పటికే దుల్కర్ చేసిన బెంగళూరు డేస్ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం.

సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. పిరియాడిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని హను తీసిన విధానం. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar) అందించిన సంగీతం. ఇవన్నీ కూడా మంచి ప్లస్ అయ్యాయి. అప్పటికే మహానటి సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి ఉన్నాడు దుల్కర్(Dq). ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయిపోయాడు. ప్రస్తుతం దుల్కర్ ఇప్పుడు తెలుగు సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు. దాదాపు ఒక నాలుగు తెలుగు సినిమాలను చేసే పనిలో పడ్డాడు.

Dulquer Salmaan

- Advertisement -

ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ పై వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్(Lucky Bhasker) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కి వచ్చింది. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు డేట్ కూడా అనౌన్స్ చేశారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఒక తరుణంలో ఆగస్టు 15కి సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. సెప్టెంబర్ ఏడో తారీఖున ఈ సినిమా ప్రేక్షకులకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను పోస్ట్ పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో ఇంత కన్ఫ్యూజన్ ఉండటం దుల్కర్ ఫ్యాన్స్ కి అన్ లక్కీ అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు