Maharaja Remake : మహరాజా రీమేక్… ఆ తెలివి తక్కువ పని చేసే హీరో ఎవరో?

Maharaja Remake : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. ఈ నేపథ్యంలోనే మహారాజ మూవీ రీమేక్ గురించి చర్చ నడుస్తోంది. దీంతో అసలు ఇలాంటి తెలివి తక్కువ పని చేసే హీరో ఎవరు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే…

రీమేక్ తెలివి తక్కువ పనే ?

కరోనా మహమ్మరి వచ్చినప్పటి నుంచే ఓటీటీలకు ఊహించని విధంగా భారీ డిమాండ్ పెరిగింది.. ఇక ఇవి అందుబాటులోకి వచ్చాక కొత్త సినిమాలను కూడా నెల రోజుల్లోపే ఇంట్లోనే ఫ్యామిలీతో కూర్చుని చూసే ఛాన్స్ దక్కడంతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని శాసించే రేంజ్ కి ఎదిగాయి ఓటీటీలు. నిజానికి ప్రస్తుతం నడుస్తున్న ఈ ఓటీటీ యుగంలో ఇష్టపడే భాషలో, ఇష్టమైన సినిమాలను, మంచి క్లారిటీతో చూసే అవకాశం ఉండడంతో, సినిమాలను రెండవసారి థియేటర్లలో చూడడం కోసం తమ సమయాన్ని వృధా చేసుకోవడానికి జనాలు సిద్ధంగా లేరు. మరి ఇలాంటి తరుణంలో రీమేక్ అంటే అది నిజంగానే తెలివి తక్కువ పని అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ ఏ భాషలో రిలీజ్ అయినా అన్నీ భాషల్లో ఓటీటీల్లో అందుబాటులో ఉంటోంది. లేదు అంటే సబ్ టైటిల్స్ ఉంటాయి కదా.

విజయ్ సేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ మహారాజా రీమేక్ గురించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మహారాజా నిజానికి ఒక బెస్ట్ మూవీ అయినప్పటికీ, దాని మ్యాజిక్, ఎఫెక్ట్ ను బాలీవుడ్ డైరెక్టర్స్ అంతా పర్ఫెక్ట్ గా అనువదించలేకపోవచ్చు. ఇది మాత్రమే కాదు తమిళం, తెలుగులో రిలీజ్ అయిన మహారాజా మూవీ ఇప్పటికే సౌత్ సినిమాలను ఇష్టపడే నార్త్ మూవీ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. త్వరలోనే ఈ మూవీ సబ్ టైటిల్స్ తో ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చేస్తుంది. ఒకవేళ రీమేక్ వల్ల హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాకపోతే, ఇప్పటికే మహారాజ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న నార్త్ మూవీ లవర్స్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసే అవకాశం ఉంది. అలా ఆల్రెడీ సగం మంది ప్రేక్షకులు ఈ మూవీని ఓటీటీలో చూసేస్తే ఇక థియేటర్లలో ఎవరు చూస్తారు? మరి ఒకవేళ నిజంగానే రీమేక్ చర్చలు జరిగితే అందులో ఏ హీరో నటిస్తాడో గానీ ఇది నిజంగానే తెలివి తక్కువ పొరపాటు అవుతుంది.

- Advertisement -

రీమేక్ రిజల్ట్స్…

ఓటీటీ పాపులర్ అయ్యాక రిలీజ్ అయిన రీమేక్ లన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అందుకు నిదర్శనమే జెర్సీ, లక్ష్మి, బచ్చన్ పాండే, షహజాదా, కీసి కా భాయ్ కీసి కా జాన్, భోలా శంకర్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు. ఇలా అన్ని భాషల్లోనూ రీమేక్ ల రిజల్ట్ డిజాస్టరే. అయితే దృశ్యం, సైతాన్ సినిమాలు మాత్రం ఎందుకు మినహాయింపు అని చెప్పుకోవచ్చు. ఆ రెండు సినిమాల్లోని కంటెంట్ అలాంటిది మరి. కానీ అన్ని సినిమాల విషయంలో ఇలా జరగదు కదా. ఇప్పుడు అక్షయ్ కుమార్ సర్ఫిరా అంటూ ఆకాశమే హద్దురా మూవీని రీమేక్ చేస్తున్నారు. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు